spot_img
Homeఎంటర్టైన్మెంట్Anasuya comments on Dating Hero: నాకు పెళ్లి కాకపొయ్యుంటే ఆ హీరోతో కచ్చితంగా డేటింగ్...

Anasuya comments on Dating Hero: నాకు పెళ్లి కాకపొయ్యుంటే ఆ హీరోతో కచ్చితంగా డేటింగ్ చేస్తా – యాంకర్ అనసూయ

Anasuya comments on Dating Hero: సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీలతో ఒకరు యాంకర్ అనసూయ(Anchor Anasuya). ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు , వీడియోలకు నెటిజెన్స్ నుండి వచ్చే రియాక్షన్స్ మామూలు రేంజ్ లో ఉండవు. 40 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందాన్ని మైంటైన్ చేస్తూ, కుర్రకారులో సెగలు పుట్టించేలా చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఈమె పలు అంశాల పై సోషల్ మీడియాని వేదికగా చేసుకొని చేసే కొన్ని కామెంట్స్ కూడా అప్పుడప్పుడు తీవ్రమైన వివాదాలకు దారి తీస్తూ ఉంటుంది. అలా నెటిజెన్స్ ఈమె పై విమర్శలు చేయడం , అలా హద్దులు దాటి విమర్శలు చేసే వారిపై ఈమె కేసులు వెయ్యడం, ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. రీసెంట్ గా శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తులపై కామెంట్ చేయడం , అందుకు అనసూయ ఇచ్చిన రియాక్షన్స్ ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇదంతా పక్కన పెడితే గతం లో ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి చక్కర్లు కొడుతూ వైరల్ గా మారాయి. పెళ్ళికి ముందు మీకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడా అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్తూ ‘ఉండేవాడు.. అతన్నే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. మీకు పెళ్లి జరగకపోయుంటే , ఏ హీరో తో డేటింగ్ చెయ్యడానికి ఇష్టపడేవారు అని అడిగిన ప్రశ్నకు, క్షణం కూడా ఆలోచించకుండా రామ్ చరణ్ పేరు చెప్పేసింది అనసూయ. రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని , అతనితో కలిసి నటించే అవకాశం వస్తే అదృష్టం గా భావిస్తానని అప్పట్లో చెప్పుకొచ్చింది. అయితే ఈ ఇంటర్వ్యూ డైరెక్టర్ సుకుమార్ చూశాడో ఏమో తెలియదు కానీ, ఆయన రామ్ చరణ్ తో తీసిన ‘రంగస్థలం’ చిత్రంలో అనసూయ కి ‘రంగమ్మత్త’ లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ని ఇచ్చాడు.

Also Read: హిందీ ‘రామాయణ్’ లో ‘హనుమాన్’ రోల్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అతనే..

ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో 5 పాత్రలు ఉంటె , అందులో కచ్చితంగా అనసూయ పాత్ర కూడా ఉంటుంది. ఆ రేంజ్ లో ఆమె ఆ పాత్రలో జీవించేసింది. ఈ చిత్రానికి ముందే అనసూయ పలు సినిమాల్లో నటించింది, అవి హిట్స్ అయినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు, కానీ ‘రంగస్థలం’ చిత్రం తర్వాత అనసూయ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. తానూ ఎంతగానో అభిమానించే హీరో తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని అనుకున్న అనసూయ కి ఏకంగా ‘రంగమ్మత్త’ లాంటి ఐకానిక్ రోల్ పడడం ఆమె అదృష్టం అనే చెప్పాలి. త్వరలోనే రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఇందులో కూడా అనసూయ కి ఒక మంచి క్యారెక్టర్ సుకుమార్ డిజైన్ చేస్తున్నట్టు సమాచారం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular