Dhurandhar 2 Premiere Gross: సరిగ్గా 5 నెలల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన వసూళ్ల సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్, ఈ సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేశాడు. ముఖ్యంగా విడుదలకు ముందు ఈ సినిమా పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కాదు. థియేటర్ లో ఈ చిత్రాన్ని చూడకపోతే మహా పాపం అనే రేంజ్ లో అనుకునేవారికి. ముఖ్యంగా జెన్ జీ యూత్ ఆడియన్స్ అయితే ఈ సినిమా మేనియా లో మునిగి తేలారు. విడుదల తర్వాత ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. అయినప్పటికీ కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చి సుమారుగా 320 కోట్ల గ్రాస్ వసూళ్లు , కేవలం ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా వచ్చాయి.
ముఖ్యంగా ప్రీమియర్ షోస్ ద్వారా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 64 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియా నుండి 34 కోట్ల రూపాయిల గ్రాస్ ప్రీమియర్స్ నుండి రాబట్టగా, ఓవర్సీస్ నుండి మరో 30 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఈ రికార్డు ని రీసెంట్ గా విడుదలై మొదటి వారం లోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తున్న ‘ధురంధర్ 2 ‘(Dhurandhar 2 Movie) కూడా అందుకోలేకపోయింది. ‘ధురంధర్ 2’ చిత్రానికి ప్రీమియర్ షోస్ ద్వారా కేవలం 62 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వరల్డ్ వైడ్ గా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అంతటి క్రేజ్ , హైప్ ని సంపాదించుకున్న సీక్వెల్ కి ‘ఓజీ’ రికార్డుని అందుకోవడం లో విఫలం అయ్యింది అంటే, ఇక మామూలు సినిమాల వల్ల అవుతుందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వచ్చే నెల 30 వ తారీఖున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం విడుదల కాబోతుంది. ‘ధురంధర్ 2 ‘, ‘ఓజీ’ చిత్రాలకు లాగానే ఈ సినిమాకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. కనీసం ఈ సినిమా అయినా ‘ఓజీ’ ప్రీమియర్ షోస్ గ్రాస్ రికార్డుని అందుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ సినిమాకు కూడా సాధ్యం అవ్వకపోతే , ఇక కేవలం ‘స్పిరిట్’, ‘వారణాసి ‘ చిత్రాలకు మాత్రమే ఈ సినిమా రికార్డుని అందుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందో లేదో చూడాలి. మార్చి 27 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో మొదలు పెట్టబోతున్నారు. ఆరంభం లో వచ్చే అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ని చూసి ఒక అంచనా కి వచ్చేయొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
