Pawan Kalyan OG records: ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్((Deputy CM Pawan Kalyan) కి సంపూర్ణమైన బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందా అంటే, అది రీసెంట్ గా విడుదలైన ‘ఓజీ'(They Call Him OG) చిత్రమే. విడుదలకు ముందే యూత్ ఆడియన్స్ ని ఈ చిత్రం విపరీతంగా ఆకర్షించింది. ఇక విడుదల తర్వాత మొదటి ఆట లోనే అభిమానుల అంచనాలను అందుకున్న ఈ చిత్రం, 10 రోజుల్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అనేక ప్రాంతాల్లో #RRR రికార్డు ని సైతం బద్దలు కొట్టింది ఈ చిత్రం. ఇదంతా పక్కన పెడితే అత్యధికంగా ప్రేక్షకులు టికెట్స్ ని కొనుగోలు చేసేది బుక్ మై షో యాప్ ద్వారా అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఈమధ్య కాలం లో డిస్ట్రిక్ట్ యాప్ కూడా బాగా పాపులర్ అయ్యింది.
ఒక్క మాటలో చెప్పాలంటే బుక్ మై షో యాప్ ని కూడా ఈమధ్య కాలం లో ఈ యాప్ డామినేట్ చేస్తుంది అనే చెప్పాలి. ఇలా రెండు గా డివైడ్ అయిపోయినప్పటికీ కూడా ఓజీ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా 27 లక్షల టిక్కెట్లు, డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా 21 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా కేవలం తెలుగు వెర్షన్ తోనే ఈ చిత్రానికి 48 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కాస్త ఫోకస్ పెట్టి, ఈ చిత్రాన్ని హిందీ లో గ్రాండ్ గా రిలీజ్ చేసి ఉండుంటే కచ్చితంగా ఈ లెక్కలు డబుల్, ట్రిపుల్ ఉండేవని అంటున్నారు ఫ్యాన్స్. ఓవరాల్ దీపావళి వరకు ఈ సినిమాకి కచ్చితంగా థియేట్రికల్ రన్ ఉండే అవకాశం ఉండడంతో కేవలం బుక్ మై షో యాప్ నుండే 30 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయే అవకాశం ఉందని అంటున్నారు.
ఒక పక్క కలెక్షన్స్ పరంగా, మరో పక్క టికెట్ సేల్స్ పరంగా ఈ చిత్రం సాధిస్తున్న రికార్డ్స్ ని చూసి అభిమానులకు కడుపు నిండిపోయింది. నేడు కూడా ఈ చిత్రం బుక్ మై షో యాప్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. చూస్తుంటే రన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటుతుందని బలంగా నమ్ముతున్నారు ట్రేడ్ పండితులు. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 145 కోట్లు రాబట్టాలి. 11 రోజుల్లో 130 కోట్ల రూపాయిలు వచ్చాయి, మరో 15 కోట్లు ఈ వీకెండ్ లో వస్తాయని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.