OG Movie Collection Day 30: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం విడుదలై 30 రోజులు పూర్తి అయ్యింది. మొన్ననే నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఇక థియేట్రికల్ రన్ ఏముంటుంది?, ఓజీ రన్ అయిపోయింది అనుకుంటే పెద్ద పొరపాటే. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతుంది. నేడు శనివారం కావడం తో కొన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ కూడా నమోదు అవుతున్నాయి. ఉదాహరణకు నేడు వైజాగ్ లో ఈ చిత్రం దీపావళి కి విడుదలైన సినిమాలతో సమానంగా వసూళ్లను రాబట్టింది. ఇది ఇప్పుడు ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. జనాలకు ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చింది అనే విషయం తెలుసా?, ఇంకా థియేటర్స్ కి వెళ్తున్నారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే 30 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
Also Read: పూరి జగన్నాధ్ – విజయ్ సేతుపతి సినిమాలో పూరి మార్క్ మిస్ అవుతుందా..?
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 58 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అనేక వెబ్ సైట్స్ ఈ చిత్రానికి ఈ ప్రాంతం లో కేవలం 53 కోట్ల రూపాయిలు వచ్చినట్టు ప్రచారం చేశారు. కానీ నైజాం దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుండి వచ్చిన నెంబర్ ఈ రేంజ్ లో ఉంది. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రానికి 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సీడెడ్ హక్కులను 22 కోట్ల రూపాయలకు ప్రముఖ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేసాడు. ఈ జానర్ సినిమాలు ఇక్కడ ఆడడం కష్టమే కాబట్టి, నష్టాలు తప్పలేదు. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఈ చిత్రానికి 16 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, తూర్పు గోదావరి జిల్లా నుండి 12 కోట్ల 50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 9 కోట్ల రూపాయిలు, కృష్ణ జిల్లా నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి .
అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 11 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, నెల్లూరు జిల్లా నుండి 4 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు 210 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కర్ణాటక ప్రాంతం నుండి 20 కోట్ల రూపాయిల గ్రాస్, 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ నుండి 33 కోట్ల రూపాయిల షేర్, తమిళనాడు నుండి 2 కోట్లు, హిందీ వెర్షన్ నుండి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 317 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 190 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.