https://oktelugu.com/

Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక పై బ్యాన్ విధించిన కన్నడ చిత్ర పరిశ్రమ

Rashmika Kannada film industry : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా..ఆ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన నటి రష్మిక మందానా..కన్నడ లో కాంతారా ఫేమ్ ‘రిషబ్ శెట్టి’ దర్శకత్వం లో వచ్చిన కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా వెండితెర అరగేంట్రం చేసిన రష్మిక తొలి చిత్రమే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఆమెకి అవకాశాలు వెల్లువలా కురిసాయి. అలా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2022 / 08:28 PM IST
    Follow us on

    Rashmika Kannada film industry : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా..ఆ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన నటి రష్మిక మందానా..కన్నడ లో కాంతారా ఫేమ్ ‘రిషబ్ శెట్టి’ దర్శకత్వం లో వచ్చిన కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా వెండితెర అరగేంట్రం చేసిన రష్మిక తొలి చిత్రమే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఆమెకి అవకాశాలు వెల్లువలా కురిసాయి.

    అలా ఆమె తెలుగు లో నాగ శౌర్య హీరో గా నటించిన ‘చలో’ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..ఇక్కడ కూడా తొలి సినిమా హిట్ అవ్వడం తో ఆ తర్వాత వెంటనే ఆమె చేసిన ‘గీత గోవిందం’ అనే చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..ఇక గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాతో ఆమె ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా అవతరించింది..ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి.

    ఇది ఇలా ఉండగా రష్మిక ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ లో ఇరుక్కుంది..ఏ ఇండస్ట్రీ లో అయినా పెద్ద హిట్ కొడితే వెంటనే స్పందించి శుభాకాంక్షలు తెలియచేసే రష్మిక, కన్నడలో ప్రభంజనం సృష్టించి ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని ఊపేసిన ‘కాంతారా’ విషయం లో మాత్రం ఒక్క కామెంట్ కూడా చెయ్యలేదని..తనకి లైఫ్ ఇచ్చిన దర్శకుడి సినిమాని ఆమె కనీసం లెక్క కూడా చెయ్యలేదని సోషల్ మీడియా లో కన్నడ ఫాన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కొంది..అంతే కాకుండా ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ‘కాంతారా మూవీ గురించి మీ అభిప్రాయం ఏమిటి’ అని యాంకర్ అడగగా ‘నేను ఆ సినిమా చూడలేదు’ అని చెప్పొకొచ్చింది రష్మిక.

    ఇంకా ఆ సినిమా గురించి యాంకర్ ప్రశ్నలు అడగబోగా చాలా సింపుల్ గా మాటని దాటవేసింది రష్మిక..దీనితో కన్నడ సినీ పరిశ్రమ అంటే అంత చులకనా నీకు..ఇక నుండి రష్మిక కన్నడ సినిమాలలో నటించడానికి వీలు లేదంటూ కన్నడ ఇండస్ట్రీ ఆమె మీద బ్యాన్ విధించిందట.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమేనా? కాదా? అన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.