Bigg Boss 9 Telugu Last Week Voting Results: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) టైటిల్ విన్నర్ గా ఎవరు నిలబడబోతున్నారు అనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ వీడలేదు. గత సీజన్స్ లో 10 వారాలకు విన్నర్ గా ఎవరు నిలబడబోతున్నారు అనేది స్పష్టంగా ఆడియన్స్ కి అర్థం అయ్యేది. ఈ సీజన్ కూడా అలాగే ఉన్నింది. 11 వారాల వరకు తనూజ నే టాప్ స్థానం లో కొనసాగుతూ వచ్చింది. ఆమెకు దరిదాపుల్లో కూడా ఎవ్వరూ ఉండేవారు కాదు. ఆమె ఒక్కటే 60 శాతం కి పైగా ఓటింగ్ నమోదు అయ్యేది. మొట్టమొదటిసారి తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఆడియన్స్ ఒక లేడీ విన్నర్ ని చూడబోతున్నారు అని అంతా అనుకున్నారు. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత లెక్కలు మొత్తం మారిపోయాయి. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రీతిలో పెరిగి తనూజ కి బలమైన పోటీ ని ఇచ్చాడు.
ప్రస్తుతానికి అయితే ఒక నాలుగు శాతం ఓటింగ్ తేడా తో పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానం లో తనూజ కొనసాగుతుంది అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ప్రస్తుతానికి రెండవ స్థానంలో డిమోన్ పవన్ కొనసాగుతున్నాడు. గడిచిన రెండు మూడు వారాల నుండి ఆయన గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రీతిలో పెరిగింది. తనూజ మీద ఒక్క శాతం ఓటింగ్ తేడా తో లీడింగ్ లో ఉన్నాడు డిమోన్ పవన్. నిన్న మొన్నటి వరకు విన్నింగ్ రేస్ కేవలం పవన్ కళ్యాణ్, తనూజ మధ్య మాత్రమే జరిగింది. ఇప్పుడు డిమోన్ పవన్ కూడా ఈ రేస్ లో కొనసాగుతున్నాడు. రాబోయే రెండు రోజుల్లో డిమోన్ పవన్ ఓటింగ్ ఇంకా భారీగా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదంతా పక్కన పెడితే విన్నర్ రేస్ నుండి మూడవ స్థానానికి, మూడవ స్థానం నుండి నాల్గవ స్థానానికి పడిపోయిన ఇమ్మానుయేల్ ని చూస్తే ఎవరికైనా బాధ వేయక తప్పదు.
ఈ హౌస్ లో విన్నర్ అవ్వడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే, కచ్చితంగా ఇమ్మానుయేల్ పేరు మన మైండ్ లోకి గుర్తుకువస్తుంది. ఒక బీస్ట్ లాగా టాస్కులు ఆడాడు, ప్రేక్షకులకు తిరుగులేని వినోదం అందించాడు, నామినేషన్స్ లో గన్ షాట్ లాంటి పాయింట్స్ పెట్టేవాడు, హౌస్ లో ఉన్న కంటెస్టెంస్ట్ అందరితో ఎంతో చక్కగా ప్రవర్తించేవాడు, కానీ కేవలం 11 వరాలు నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల ఆయనకు బలమైన దెబ్బ పడింది. అంతే కాకుండా చాలా సేఫ్ గా గేమ్ ఆడుతాడు అనే పేరు కూడా ఉంది, అందుకే గేమ్ సీరియస్ అయ్యే కొద్దీ ఇమ్మానుయేల్ గ్రాఫ్ ఇలా పడిపోయింది. ఇక సంజన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె టాప్ 5 లోకి రావడమే ఒక మిరాకిల్ అనే ఫీలింగ్ లో ఉంది.