Pawan Salmaan : ఎంతపెద్ద సూపర్ స్టార్ కి అయినా హిట్స్ తో పాటుగా ఫ్లాప్స్, డిజాస్టర్ ఫ్లాప్స్ ఉండడం సర్వసాధారణం..అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ తో పాటుగా డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా బాగానే ఉన్నాయి..కానీ ఎన్ని డిజాస్టర్స్ వచ్చిన ఫ్యాన్స్ ఫీల్ అవ్వలేదు కానీ..పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం పెద్ద డిజాస్టర్ అవ్వడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని చాలా తీవ్రంగా కలిచివేసింది.
ఎందుకంటే వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో వచ్చిన జల్సా మరియు అత్తారింటికి దారేది చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి..అందువల్ల అజ్ఞాతవాసి చిత్రం పై ఫాన్స్ మరియు ప్రేక్షకుల్లో వేరే లెవెల్ అంచనాలు ఏర్పడ్డాయి..కానీ ఆ అంచనాలను ఈ చిత్రం కనీస స్థాయిలో కూడా రీచ్ అవ్వలేదు..స్టోరీ బాగానే ఉన్నప్పటికీ త్రివిక్రమ్ టేకింగ్ విషయం లో ఫెయిల్ అవ్వడం తో ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా హిందీ డబ్ వెర్షన్ కి యూట్యూబ్ లో వందలకొద్దీ మిలియన్ వ్యూస్ వచ్చాయి..నార్త్ ఆడియన్స్ మొత్తం ఈ సినిమాని నెత్తిన పెట్టుకున్నారు..ఆ రేంజ్ రెస్పాన్స్ ని ఎవ్వరూ ఊహించలేదు కూడా..అంతే కాకుండా ఈ సినిమా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి కూడా తెగ నచ్చేసిందట..ఇదే స్టోరీ లైన్ తో కాస్త మార్పులు చేసి రీమేక్ చేద్దామని ప్రముఖ దర్శకుడు ప్రభుదేవా తో అన్నాడట సల్మాన్ ఖాన్..వీళ్లిద్దరి కాంబినేషన్ లో చాలా సూపర్ హిట్ సినిమాలే వచ్చాయి.
కానీ గత ఏడాది వీళ్లిద్దరి కాంబినేషన్ నుండి వచ్చిన ‘రాధే’ అనే సినిమా మాత్రం ఘోరమైన ఫ్లాప్ గా మిగిలింది..మళ్ళీ ఇప్పుడు తెలుగు లో డిజాస్టర్ అయినా సినిమాని రీమేక్ చేసే ఆలోచన ఉన్న సల్మాన్ ఖాన్ ని చూసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు..చాలా కాలం నుండి సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు డిజాస్టర్ మూవీ ని రీమేక్ చెయ్యడం ఎంత వరుకు కరెక్ట్ అనేది చూడాలి.