Akhanda 2 Collection Day 6: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం ఆరు రోజులు పూర్తి చేసుకొని 7వ రోజు లోకి అడుగుపెట్టింది. మొదటి నుండి ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండడం వల్ల ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. వీకెండ్ వరకు పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత నుండే ఈ సినిమాకు అసలు సిసలు అగ్నిపరీక్ష మొదలైంది. సోమవారం నుండి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. కానీ సీడెడ్ ప్రాంతం లో మాత్రం ఒక మోస్తారుగా స్టడీ కలెక్షన్స్ ని మైంటైన్ చేస్తూ వచ్చింది. కానీ ఆరవ రోజున సీడెడ్ ప్రాంతం లో కూడా దారుణంగా వసూళ్లు పడిపోయాయి. ఇక నందమూరి ఫ్యామిలీ కి కంచుకోట గా పిలవబడే గుంటూరు జిల్లాలో కూడా ఈ చిత్రానికి నిన్న అనేక ప్రాంతాల్లో షేర్ వసూళ్లు రాలేదు.
ఒంగోలు గడ్డ, నందమూరి అడ్డా అని అంటుంటారు ఫ్యాన్స్. అలాంటి చోట నిన్నటి నుండి నెట్ ఫ్రీ మీద నడుస్తుంది ఈ చిత్రం. ఈ ప్రాంతానికి థర్డ్ పార్టీ వాళ్ళు కోటి 30 లక్షలకు హైర్ చేశారు. కానీ షేర్ వసూళ్లు రాకపోవడం తో, ఈ చిత్రాన్ని మైంటైన్ చేసే స్తొమత లేక, వదిలేశారు. అడ్డా అని చెప్పుకునే ప్రాంతాల్లోనే ఇలా ఉంటే, ఇక ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో మీరే ఊహించుకోండి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ చిత్రానికి నిన్న, మొన్న నెగిటివ్ షేర్స్ నమోదు అయ్యాయి. అంటే సున్నా కంటే తక్కువ అన్నమాట. మొదటి మూడు రోజుల్లో వచ్చిన షేర్ వసూళ్లు కూడా ఈ నెగిటివ్ షేర్స్ వాళ్ళ మైనస్ అవుతాయి. గోదావరి జిల్లాలు మొత్తం రెంటల్ బేసిస్ మీద అగ్రిమెంట్ చేసుకోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది.
కృష్ణా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా రెంటల్ బేసిస్ మీద ఈ సినిమాని రన్ చేస్తే షేర్స్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. 5 వ రోజు నుండి కమీషన్ బేసిస్ మీద రన్ చేస్తున్నారు కాబట్టి, కాస్త షేర్స్ కనిపిస్తున్నాయి. ఆరవ రోజున ఈ చిత్రానికి 4 లక్షల 50 వేల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలా ఈ మూడు జిల్లాల్లో పూర్తిగా షేర్ వసూళ్లు రావడం ఆగిపోయాయి. నైజాం ప్రాంతం గురించి ఇక ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓవరాల్ గా ఆరవ రోజున ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిలకంటే తక్కువ షేర్ వసూళ్లు నమోదు అయ్యినట్టు తెలుస్తోంది. ఫుల్ రన్ లో కచ్చితంగా 40 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.