NTR: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటున్నాడు. ముఖ్యంగా ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబట్టుకున్నాడు. పాన్ ఇండియాలో అతనికి మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఇదిలా ఉంటే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత అతను పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నప్పటికి ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా అతనికి ఏ మాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయింది…
త్రిబుల్ ఆర్ సినిమాలో చేసినప్పటికి రామ్ చరణ్ తో పోలిస్తే ఎన్టీఆర్ కి చాలా తక్కువ క్రేజ్ వచ్చింది. ఇక వార్ 2 సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన గురించి మాట్లాడే వారే కరువైపోయారు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ కి మల్టీ స్టారర్ సినిమాలు అచ్చి రావడం లేదని అతని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి ఇంతకు ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ సోలోగా చేసిన సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. కానీ మల్టీ స్టారర్ సినిమాల వైపు ఎప్పుడైతే అడుగులు వేశాడో ఆయన అప్పటినుంచి అతనికి బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. ఇక ఇప్పటికైనా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి మరోసారి తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే…
ఇక ప్రశాంత నీల్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి రీసెంట్ గా వెట్రీ మారన్ సైతం ఇలాంటి సినిమా చేస్తున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాల కాన్సెప్ట్ లు ఒకటైతే మాత్రం వీళ్ళిద్దరి సినిమాలకు దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి. వీళ్ళు వీలైనంత తొందరగా దానికి సంబంధించిన ఒక క్లారిటి తెచ్చుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు…
