‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ షూటింగ్ అయిపోతోంది. ఎన్టీఆర్, రాంచరణ్ లు రాజమౌళి నుంచి విడుదలవుతున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత వచ్చే దసరాకి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాబోతోంది. ఇక రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటి? ఎవరితో చేస్తానని ఇదివరకే ప్రకటించాడు. మహేష్ బాబుతో సినిమా ఉంటుందని.. దీనిని దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్ పై తెరకెక్కిస్తున్నట్లుగా రాజమౌలి ఇదివరకే ప్రకటించాడు.. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అన్నదానిపై టాలీవుడ్ లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో చారిత్రక గాథలను తెరపై చూపించిన రాజమౌళి.. ఇప్పుడు రాబోయే సినిమాలో మహేష్ బాబును ఎలా చూపిస్తాడన్నది ఆసక్తి రేపుతోంది. అయితే చాలా మంది ఆర్ఆర్ఆర్ లోనే అల్లూరి సీతారామరాజుగా మహేష్ ను చూపించొచ్చు కదా అని రాజమౌళిని సోషల్ మీడియాలో అడిగేశారట.. మహేష్ నాన్న ‘కృష్ణ’ వేసిన అల్లూరి పాత్ర టాలీవుడ్ లోనే ఎవర్ గ్రీన్. ఆ పాత్రను రాంచరణ్ కు కాకుండా మహేష్ బాబుకు వేస్తే బాగుంటుంది కదా అని రాజమౌళికి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని రాజమౌళిని అడిగితే ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా మొదట తాను అనుకున్నానని తెలిపారు. అల్లురి సీతారామ రాజుగా నేనే మహేష్ బాబు ని ఈ సినిమాలో తీసుకోకపోవడానికి కారణం ప్రేక్షకులే అని చెప్పాడు రాజమౌళి. తాను ఆర్ఆర్ఆర్ సినిమా తీసే ముందు మహేష్ బాబుతో సినిమా తీస్తే ఎలాంటి సినిమా తీయాలా అని ఆలోచించుకుంటూ అసలు ప్రేక్షకులు నేనే మహేష్ బాబుని ఎలా చూపించాలని కోరుకుంటున్నారో తెలుసుకుందాం అని ఒక పోల్ ను సోషల్ మీడియాలో పెట్టాడట.. రాజమౌళి పెట్టిన ఈ పోల్ కి చాలా తక్కువ మంది మహేష్ బాబుని అల్లురి సీతారామా రాజుగా చూడాలని అనుకుంటున్నారని అభిప్రాయపడ్డారట..
అంతేకాకుండా ఒకవేళ మా కాంబినేషన్ లో సినిమా వస్తే ఎక్కువ మంది మహేష్ బాబు ని జేమ్స్ బాండ్ ని చూడాలని అనుకుంటున్నట్లు ఓటు వేశారని రాజమౌళి తెలిపారు. అందుకే నేనే ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా మహేష్ బాబుని తీసుకోలేదు అని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.