https://oktelugu.com/

ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు రూ.1,300 చెల్లిస్తే లక్షల్లో రాబడి..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజల కోసం ఎన్నో పాలసీలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇతర స్కీమ్ లతో పోలిస్తే ఒక స్కీమ్ ప్రజలకు మెచ్యూరిటీ బెనిఫిట్స్ ను మెరుగ్గా అందిస్తోంది. అవసరాలకు అనుగుణంగా ఎన్నో పాలసీలు అందుబాటులో ఉండగా ఎల్‌ఐసీ అమలు చేస్తున్న పాలసీలలో జీవన్ ఉమాంగ్ పాలసీ కూడా ఒకటి. Also Read: ఆ ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా.. 2.30 లక్షలు నష్టపోయే ఛాన్స్..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 8, 2021 / 06:26 PM IST
    Follow us on

    దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజల కోసం ఎన్నో పాలసీలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇతర స్కీమ్ లతో పోలిస్తే ఒక స్కీమ్ ప్రజలకు మెచ్యూరిటీ బెనిఫిట్స్ ను మెరుగ్గా అందిస్తోంది. అవసరాలకు అనుగుణంగా ఎన్నో పాలసీలు అందుబాటులో ఉండగా ఎల్‌ఐసీ అమలు చేస్తున్న పాలసీలలో జీవన్ ఉమాంగ్ పాలసీ కూడా ఒకటి.

    Also Read: ఆ ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా.. 2.30 లక్షలు నష్టపోయే ఛాన్స్..?

    ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో వాళ్లు నెలకు 1,300 రూపాయల చొప్పున 30 సంవత్సరాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత 31వ సంవత్సరం నుంచి సంవత్సరానికి 40,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. అలా జీవితాంతం పొందే అవకాశం ఉంటుంది. 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తే 100 సంవత్సరాల తరువాత కూడా ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చు.

    Also Read: ఉద్యోగులకు హెచ్‌సీఎల్ శుభవార్త.. రూ. 700 కోట్ల స్పెషల్ బోనస్..?

    55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు జీవన్ ఉమాంగ్ పాలసీని తీసుకోవడానికి అర్హులు. ఈ స్కీమ్ ద్వారా సంవత్సరానికి రూ.15,624 చెల్లిస్తే 40,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. చిన్న వయస్సులో ఈ పాలసీని తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. సమీపంలో ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి లేదా ఎల్‌ఐసీ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    30 సంవత్సరాలలో రూ.4.68 లక్షలు చెల్లిస్తే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎల్‌ఐసీ ఈ పాలసీతో పాటు మరికొన్ని అత్యుత్తమ పాలసీలను ప్రజల కోసం అందుబాటులోకి తెస్తోంది.