Coolie Movie First Choice: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) నటించిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం పై ఎంతటి క్రేజ్, హైప్ ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. టికెట్స్ కోసం తమిళ్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ పెద్ద యుద్ధమే చేస్తున్నారు. తెలుగు లో ఇంకా పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. తెలుగు వెర్షన్ బుకింగ్స్ ప్రారంభం అవ్వకముందే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ మొదలైతే ఈ సినిమా కేవలం ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే వంద కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ని రాబడుతుంది. ఇప్పటి వరకు పుష్ప 2 చిత్రానికి తప్ప, ఏ సినిమాకు కూడా ఇలా విడుదలకు ముందే వంద కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వసూళ్లు రాలేదు. 75 ఏళ్ళ వయస్సులో కూడా రజినీకాంత్ నేటి తరం సూపర్ స్టార్స్ కి సాధ్యపడని రికార్డ్స్ ని నెలకొల్పుతున్నాడు.
Also Read: ‘వార్ 2’ నుండి 28 సన్నివేశాలను కత్తిరించిన సెన్సార్ బోర్డు..ఎన్టీఆర్ కి అన్యాయం?
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) డైరెక్టర్ అవ్వకముందు ఒకే ఒక్క అవకాశం కోసం తెలుగు, తమిళ ఇండస్ట్రీస్ చుట్టూ తిరిగాడు. కానీ ఆయనకు సందీప్ కిషన్ తప్ప ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. ఆ సమయం లో ఆయన ఎంతో మంది హీరోల అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూశారు. ఆ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా ఉన్నాడట. ఇప్పుడు ఆయన రాసుకున్న ‘కూలీ’ చిత్రం అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కి వినిపించాడట. అప్పుడే చిరంజీవి తన 150 వ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతూ ఉన్నాడట. ఆ సమయంలో ఆయన అనేక కథలను వింటూ వచ్చాడు. లోకేష్ కనకరాజ్ కూడా తాను రాసుకున్న కూలీ మూవీ స్టోరీ ని వినిపించడానికి వెళ్ళాడట.
Also Read: వార్ 2 vs కూలీ సినిమాల్లో ఏ మూవీ హిట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ప్లస్…
కానీ కొంతమంది ఆయన్ని మెగాస్టార్ వరకు చేరనివ్వలేదట. ఒకవేళ చిరంజీవి ఈ కథని విని ఉండుంటే చేసే వాడేమో. ఒక క్రేజీ సినిమాని మెగా అభిమానులు నేడు మిస్ అయ్యేవారు కాదు. ఇక ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ కి కార్తీ ‘ఖైదీ’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడం, ఆ సినిమా రెండు భాషల్లోనూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడం, ఆ తర్వాత మాస్టర్, విక్రమ్, లియో వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా మారిపోవడం వంటివి జరిగాయి. అయితే రజినీకాంత్ తో సినిమా చెయ్యాలని అనుకున్నప్పుడు అప్పట్లో మెగాస్టార్ కోసం రాసుకున్న స్టోరీ లైన్ ని, రజినీకాంత్ స్టైల్ కి మార్చి స్క్రిప్ట్ ని రెడీ చేసాడట. ఈ స్క్రిప్ట్ రజినీకాంత్ కి వినిపించిన వెంటనే ఆయనకు తెగ నచ్చేసింది, వెంటనే ఓకే చెప్పి, ఈ సినిమాని చేసేసాడు, మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.