War 2 Scenes Censor Cuts: మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ తీవ్ర స్థాయిలో నిరాశపరిచాయి. కనీసం హాఫ్ డాలర్ల గ్రాస్ వసూళ్లను కూడా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ నుండి రాబట్టలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు. కానీ కర్ణాటకలో మొదలైంది. బుకింగ్స్ మొదలై రెండు రోజులు పూర్తి అయినా కూడా ఈ సినిమా ఇంకా కోటి రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోలేకపోవడం గమనార్హం. ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఇప్పటి వరకు 15 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఎన్టీఆర్ గత చిత్రం దేవర కి ప్రపంచవ్యాప్తగా 85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 85 కోట్లు ఎక్కడా?, 15 కోట్లు ఎక్కడా?, ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఈ సినిమా పై కనీస స్థాయి ప్రభావం కూడా చూపలేకపోయింది. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సాధారణంగా ఇలాంటి యాక్షన్ చిత్రాలకు సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ని జారీ చేస్తుంది. కానీ ఈ చిత్రానికి మాత్రం UA సర్టిఫికేట్ ని జారీ చేసింది. ఈ సర్టిఫికేట్ ఇచ్చే ముందు సెన్సార్ బోర్డు 28 సన్నివేశాల్లో కత్తిరింపులు చేసింది. ఆ కత్తిరింపులు లేకుండా ఎలా ఉన్న సినిమాని అలా రిలీజ్ చెయ్యాలంటే కచ్చితంగా A సర్టిఫికేట్ వచ్చేది. కానీ అందుకు మేకర్స్ ఒప్పుకున్నట్టుగా లేదు. అందుకే UA వచ్చింది. అయితే సెన్సార్ లో కట్ చేయబడిన సన్నివేశాలు అత్యధిక శాతం ఎన్టీఆర్ వే ఉండడం గమనార్హం.
Also Read: వార్ 2 vs కూలీ సినిమాల్లో ఏ మూవీ హిట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ప్లస్…
దీంతో అభిమానులు ఎన్టీఆర్ కి అన్యాయం జరిగింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సెన్సార్ రివ్యూ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఉంటుందట, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందట. ఆయన ఎంట్రీ సన్నివేశం మొదటి 20 నిమిషాలు లోపే ఉంటుందట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ డామినేషన్ ఉంటుందని టాక్. సెకండ్ హాఫ్ మొత్తం హృతిక్ రోషన్ డామినేషన్ ఉంటుందట. క్లైమాక్స్ సన్నివేశం ఎన్టీఆర్ అభిమానుల మనసులు నొచ్చుకోని విధంగా డిజైన్ చేశారట. సినిమాలో వచ్చే ట్విస్టులు పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉంటాయట. ఓవరాల్ గా ఈ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఉందని, ఇక ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దానిని బట్టీ ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందని అంటున్నారు.