https://oktelugu.com/

బర్త్‌డే స్పెషల్: గోపీచంద్ ‘సీటీమార్’పై కీలక అప్‌డేట్

చాలా రోజుల నుంచి ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్ తన తాజా చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన ఇప్పుడు ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్. దిగంగన సూర్యవంశి మరో నాయిక. భూమిక‌ చావ్లా, రెహ‌మాన్‌, ప్రదీప్ రావత్, దేవ్ గిల్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, అజయ్, జయప్రకాశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ […]

Written By:
  • admin
  • , Updated On : June 12, 2020 / 04:06 PM IST
    Follow us on


    చాలా రోజుల నుంచి ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్ తన తాజా చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన ఇప్పుడు ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్. దిగంగన సూర్యవంశి మరో నాయిక. భూమిక‌ చావ్లా, రెహ‌మాన్‌, ప్రదీప్ రావత్, దేవ్ గిల్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, అజయ్, జయప్రకాశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్కు ముందే మూడు షెడ్యూల్స్ పూర్తి చేయగా.. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తయింది.

    శుక్రవారం గోపీచంద్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ హీరో ఫస్ట్‌ లుక్‌కు సంబంధించి రెండు చిత్రాలను రిలీజ్ చేసింది. ఓ మైదానంలో వెనకాల క్రీడాకారిణులు ఉంగా.. ట్రాక్ సూట్, క్యాప్‌, మెడలో విజిల్‌తో గంభీరంగా నిలుచున్నాడు. ఇదే డ్రస్‌లో మరో క్లోజప్‌ ఫొటోను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా గోపీ, తెలంగాణ టీమ్ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు జ్వాలా రెడ్డి అని యూనిట్ ప్రకటించింది. హీరో పాత్ర పేరు తెలియాల్సి ఉంది. కాగా, టీవీ జర్నలిస్ట్ పాత్రలో దిగాంగన నటిస్తోంది.

    షూటింగ్‌ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సీటీమార్లో మిగిలిన భాగం చిత్రీకరణ ఆగస్టు ఫస్ట్‌ వీక్‌లో మొదలు పెట్టాలని చిత్ర యూనిట్‌ ప్లాన్ చేసింది. సాధ్యమైనంత త్వరగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్‌ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.