https://oktelugu.com/

అందుకే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశాం..

  మాజీ మంత్రి టీడీఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ స్పందించారు. శుక్రవారం ఉదయం 7.30కి అచ్చెన్నాయుడుని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారితో పాటు సీకే రమేష్, జి.విజయకుమార్, డాక్టర్ జనార్దన్, ఈ. రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందించారు. మందుల కొనుగోళ్లలో ఆయన అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేశారని తెలిపారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 12, 2020 / 04:08 PM IST
    Follow us on

     

    మాజీ మంత్రి టీడీఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ స్పందించారు. శుక్రవారం ఉదయం 7.30కి అచ్చెన్నాయుడుని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారితో పాటు సీకే రమేష్, జి.విజయకుమార్, డాక్టర్ జనార్దన్, ఈ. రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

    ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందించారు. మందుల కొనుగోళ్లలో ఆయన అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేశారని తెలిపారు. వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని ఆమె చెప్పారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. సీఎం జగన్ ను అరెస్ట్ చేసినప్పుడు సంబరాలు చేసుకున్నవారు ఇప్పుడెలా మాట్లాడతారని ప్రశ్నించారు.

    చంద్రబాబు చెప్పినట్లుగా అచ్చెన్నాయుడిని లాక్కుని వెళ్లలేదని మామూలుగానే తీసుకెళ్లారని తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా? అది కేంద్ర ప్రభుత్వ డబ్భైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్భైనా చర్యలు తీసుకోవాలి కదా? అని హోంమంత్రి సుచరిత చెప్పుకొచ్చారు. కాగా అచ్చెన్నాయుడిని ఇవాళ ఉదయం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం 4గంటలకు విజయవాడలో ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.