Vishwambhara Teaser: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie). వశిష్ఠ(Vasistha Malladi) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్లో ఎలాంటి అంచనాలు ఉండేవో మన అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే టీజర్ విడుదలైందో, అప్పటి నుండి అంచనాలన్నీ ఆవిరి అయిపోయాయి. గ్రాఫిక్స్ వర్క్స్ తో డైరెక్టర్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ఇలాంటి రోజుల్లో ఇంతటి నాసిరకపు గ్రాఫిక్స్ ని వాడడం ఏమిటి?, భారీ బడ్జెట్ అని చెప్పారు?, మొత్తం అబద్దాలేనా అని అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక చిరంజీవి దురాభిమానుల నుండి ఎలాంటి ట్రోల్స్ ఎదురయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘లక్ష్మి గణపతి ఫిలిమ్స్..దెయ్యాల కోట’ అని కొందరు, సంతూర్ సోప్ యాడ్స్ ని మరికొందరు, ఈ టీజర్ లోని షాట్స్ ని వాడుకొని తెగ కామెడీ చేశారు. మెగా ఫ్యాన్స్ కూడా వాదించుకోలేని పరిస్థితిలో పడ్డారు.
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
అయితే ఈ టీజర్ గ్రాఫిక్స్ గురించి వశిష్ఠ తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ విశ్వంభర మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత గ్రాఫిక్స్ వర్క్ కోసం ఫుటేజీ ని పంపించారు. మూడు నెలల్లో గ్రాఫిక్స్ వర్క్ మొత్తం పూర్తి చేసి ఇస్తామని మాట ఇచ్చారు. అవతల నిర్మాతలు సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. కానీ కంపెనీ నుండి ఫుటేజీ అనుకున్న సమయంలో రాలేదు. 9 నెలలు గడిచిపోయాయి, అయినప్పటికీ గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి అవ్వలేదు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో AI జనరేటెడ్ గ్రాఫిక్స్ తో టీజర్ ని విడుదల చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియా లో అభిమానుల నుండి వచ్చిన ట్రోల్స్ ని చూసి టీం మొత్తం భయపడింది. ఇక నుండి బయటకు వదిలే ప్రమోషనల్ కంటెంట్ పై జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు’.
‘గ్రాఫిక్స్ విషయం లో మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఔట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే సరికొత్త టీజర్ ని విడుదల చేయబోతున్నారు. అభిమానుల్లో ఉన్న అనుమానాలను మొత్తం పటాపంచలు చేస్తుంది ఈ టీజర్. విమర్శించిన వాళ్ళే గ్రాఫిక్స్ విషయం లో పొగుడుతారు చూడండి’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం ఈ సినిమాని వాయిదా వేశారు. దిల్ రాజు కాస్త ముందుగా వచ్చి ఈ సినిమాని వాయిదా వెయ్యమని అడిగి ఉండుంటే ఆ టీజర్ ని అంత హడావడిగా వదిలేవాళ్ళు కారు అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గానే హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ‘రామ రామ’ పాటకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read: విజయ్ తో బ్రేకప్ విషయంలో తమన్నాకు చిరంజీవి సలహా..అసలు ఏమైందంటే!