Godfather Trailer: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం వచ్చే నెల 5 వ తారీఖున దసరా కానుకగా తెలుగు , హిందీ మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదల కాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య ఫ్లాప్ అవ్వడం తో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ సినిమా కోసం దెబ్బ తిన్న పులులుగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..ఇన్సైడ్ టాక్ కూడా అదిరిపోవడం తో ఈ సినిమా పై విడుదలకి ముందు నుండే పాజిటివ్ బజ్ బాగా ఏర్పడింది..ఇక ఈరోజు గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపూర్ లో ఘనంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఫంక్షన్ కి ఇసుక వేస్తె రాలనంత జనం హాజరయ్యారు..సీమలో ఎక్కడ చూసిన మెగా మయం అయిపోయింది..ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి వినిపిస్తున్నది ఒక్కటే మాట..చిరంజీవి గారి రీ ఎంట్రీ తర్వాత వచ్చిన సినిమాలు అన్నిటికంటే గాడ్ ఫాదర్ సినిమా అదిరిపోతుందని అంటున్నారు..పొలిటికల్ నేపథ్యం లో సాగే ఈ కథలో మెగాస్టార్ నటవిశ్వరూపం చూడబోతున్నాము అనేది స్పష్టంగా ట్రైలర్ లో అర్థమైపోతుంది..ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా మోహన్ లాల్ లూసిఫెర్ కి రీమేక్ అనే విషయం మన అందరికి తెలిసిందే..ట్రైలర్ చూస్తున్నప్పుడు లూసిఫెర్ సినిమా మనకి అడుగడుగునా గుర్తుకు వచ్చినా డైరెక్టర్ మోహన్ రాజా చిరంజీవి స్టైల్ లో అదిరిపొయ్యే ఎలివేషన్స్ తో దుమ్ము లేపేసాడని అర్థం అయిపోతుంది.

ఇక ఈ ట్రైలర్ లో డైలాగ్స్ కూడా వింటేజ్ మెగాస్టార్ మాస్ ని గుర్తు చేస్తుంది..విలన్ గా సత్యదేవ్ కూడా ఈ సినిమాలో అదరగొట్టేసినట్టు అనిపిస్తుంది..కానీ సంగీత దర్శకుడు థమన్ సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టి ఉంటె బాగుండేది అనిపించింది..గతం లో భీమ్లా నాయక్ ట్రైలర్ కి కూడా అలాగే చేసాడు..కానీ సినిమాకి ఏ రేంజ్ లో కొట్టాడో మన అందరికి తెలిసిందే..ఆ సినిమా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకరిగా నిలిచాడు థమన్..రేపు గాడ్ ఫాదర్ విషయం లో కూడా అదే జరగబోతుందట..చూడాలి మరి మెగా అభిమానుల భారీ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది.
