Mahesh Babu-Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఈ ఏడాది చాలా శోకాన్ని మిగిలించిన ఏడాది గా చెప్పుకోవచ్చు..కొద్దీ రోజుల క్రితమే ఆయన తన అన్నయ్య రమేష్ బాబు ని కోల్పోయిన సంగతి మన అందరికి తెలిసిందే..కరోనా సోకడం వల్ల తన అన్నయ్య ని చివరి చూపు కూడా చూసుకోలేకపొయ్యాడు..ఇది నిజంగా ఎంతో బాధకి గురి చేసే విషయం..పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు..ఈ బాధ నుండి మెల్లిగా కోలుకుంటున్న సమయం లో ఈరోజు మహేష్ బాబు ఎంతగానో ప్రేమించే తన తల్లిని కూడా కోల్పోవడం నిజంగా శోచనీయం..ఈ పరిస్థితి ఊహిస్తూనే మనకి ఏదోలా ఉంది ఇక అనుభవిస్తున్న మహేష్ బాబు కి, సూపర్ స్టార్ కృష్ణ గారికి మరియు వారి కుటుంబ సబ్యులకు ఎలా ఉంటుందో ఊహించడానికి కష్టమే..ఈరోజు మహేష్ బాబు కూతురు సితార తన నాన్నమ్మ పార్థివ దేహం వద్ద కూర్చొని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న వీడియో అభిమానుల మనసుని కలిచివేసింది.

ఇందిరా దేవి గారికి గత కొద్దీ రోజుల నుండి తీవ్రమైన అస్వస్థత ఏర్పడింది..చికిత్స కోసం ఆమెని AIG హాస్పిటల్స్ లో చేర్పించారు..గత రెండు రోజుల నుండి ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారు..మహేష్ బాబు ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి మన అందరికి తెలిసిందే..షూటింగ్ ప్రారంభమై వారం రోజులు కాకముందే బ్రేక్ రావడం తో షెడ్యూల్ అయ్యిపోయిదేమో అని అనుకున్నారు ఫాన్స్..కానీ షూటింగ్ ఆగిపోవడానికి కారణం మహేష్ బాబు గారి తల్లి ఆరోగ్యమే..గత రెండు రోజుల నుండి ఆయన AIG హాస్పిటల్స్ లోనే ఉంటున్నాడు..అమ్మ కి ఆరోగ్యం సీరియస్ గా ఉంది అని తెలిసినప్పటి నుండి ఆయన కునుకు కూడా వెయ్యలేని పరిస్థితి.

చిన్నతనం నుండి మహేష్ బాబు కి తన తల్లిగారితో ఉన్న అనుబంధం చాలా బలమైనది..ఎప్పుడైనా నేను ఫుల్ టెన్షన్ లో ఉన్నప్పుడు కానీ,బాధలో ఉన్నప్పుడు కానీ వెంటనే తన అమ్మ దగ్గరకి వెళ్ళేవాడిని అని..ఆమె చేతి కాఫీ తాగిన వెంటనే నా బాధలు మర్చిపొయ్యేవాడినని మహేష్ బాబు ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో కూడా తెలిపాడు..ఆ వీడియో ఈరోజు సోషల్ మీడియా మొత్తం తిరుగుతూనే ఉంది..ఇందిరమ్మ గారి ఆత్మ ఎక్కడ ఉన్న శాంతి చేకూరాలని..ఆమె లేని బాధ నుండి కృష్ణ గారు మరియు మహేష్ బాబు గారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.