Godfather Pre-Release Event: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన సినిమా గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అనంతపూర్ లో నిర్వహించారు. సినిమాకు సంబంధించిన విశేషాలను చిరంజీవి చెబుతూ గాడ్ ఫాదర్ సినిమా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. రాజకీయాలకు స్వస్తి పలికిన తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా సైరా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. దీంతో ఇప్పుడు ఆశలన్నీ గాడ్ ఫాదర్ మీదే ఉన్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందని అంచనా వేస్తున్నారు.

గాడ్ ఫాదర్ వేడుకలో ప్రేక్షకులే తనకు గాడ్ ఫాదర్ అని చిరు చెప్పడంతో సభా ప్రాంగణం మారుమోగింది. తనకు ఎవరు గాడ్ ఫాదర్ లేరని చెబుతుంటారు కానీ ప్రేక్షకులే తనకు గాడ్ ఫాదర్ అని చెప్పడం విశేషం. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ నిర్మించారు. దీంతో చిత్రం విజయం సాధిస్తుందని అందరు విశ్వసిస్తున్నారు. దానికి తగినట్లుగానే చిత్రం బాగా వచ్చిందని చిరు చెబుతున్నారు. ఈసందర్భంగా మహేశ్ బాబు తల్లికి సభా వేదికగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
వర్షం పడుతున్నా లెక్క చేయకుండా అభిమానులు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఇంద్ర సినిమా ఫంక్షన్ కు కూడా ఇలాగే వానదేవుడు పలకరించాడని గుర్తు చేసుకున్నారు. తాను ఎప్పుడు సీమకు వచ్చినా వర్షం పలకరించడం చూస్తుంటే మనకు వర్షానికి ఏదో సంబంధం ఉందని చెప్పారు. గాడ్ ఫాదర్ చేయడానికి కారణం రాంచరణే. నీ ఇమేజ్ కు తగిన సినిమా అంటే గాడ్ ఫాదరే. ఇది కచ్చితంగా చేయాలని పట్టుబట్టి మరీ చేయించాడు. సినిమాలో సల్మాన్ ఖాన్ ను నటించాలని ఒప్పించింది కూడా రాంచరణే. దీంతో సినిమాపై అందరికి అంచనాలు పెరిగాయి. అందుకు తగినట్లే సినిమా ఉంటుంది.

ఇక తమ్ముడు పవన్ కల్యాణ్ గురించి వివరించారు. చిన్నవాడైనా జాతీయ అవార్డు అందుకున్నాడు. పవన్ అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు. పవనే ఓ శక్తి. విజయదశమి రోజు విడుదలయ్యే గాడ్ ఫాదర్ ను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం. నాగార్జున నటించి ది ఘోస్ట్ ను కూడా విజయవంతం చేయాలని కోరారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నారు. విజయదశమికి వచ్చిన తన చిత్రాలన్ని విజయవంతమయ్యాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ కూడా తప్పకుండా మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని చెప్పడం గమనార్హం.
గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో ఎందుకు ఏర్పాటు చేశారనే దానిపై కూడా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం అనంతపూర్ లో నిర్వహించారనే టాక్ వస్తోంది. జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని చిరు భావిస్తున్నట్లు ఇదివరకే వార్తలు రావడంతో ప్రస్తుతం ఈ ఈవెంట్ పై కూడా రాజకీయ విశ్లేషకులు స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ పార్టీకి వెనక నుంచైనా మద్దతు ఇచ్చేందుకు చిరు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తన అభిమానులను జనసేనకు ఓటు వేయాలని చెప్పడానికే అనంతపూర్ ను ఎంచుకున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి.
Also Read: Janasena Chief Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఏపీలో పెరుగుతున్న మద్దతు..? ఎలాగంటే?