https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ గా గౌతమ్..రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో డిమాండ్ చేసాడో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

కొంతమంది టాప్ కంటెస్టెంట్స్ అని అడగగా వస్తాము కానీ, అంతకు ముందు ఇచ్చిన రెమ్యూనరేషన్ కి డబుల్ ఇస్తామంటేనే వస్తాం అని అంటున్నారట. దీంతో బిగ్ బాస్ కొంతమంది క్రేజీ కంటెస్టెంట్స్ విషయంలో వెనకడుగు వేసిందట. అయితే ప్రస్తుతం ఖరారైన కంటెస్టెంట్స్ లో గౌతమ్ కూడా ఉన్నాడు. గత సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైన 5 మంది కంటెస్టెంట్స్ లో గౌతమ్ కూడా ఒకడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 28, 2024 / 03:57 PM IST

    Bigg Boss 8 Telugu(56)

    Follow us on

    Bigg Boss 8 Telugu: వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్స్ రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 9 మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం ‘సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్’ టాస్కులను మరోసారి కొనసాగించి ఇంకో ముగ్గురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీజన్ లో ఏదైనా జరగొచ్చు. అయితే ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ పెద్దగా కంటెంట్ ఇవ్వలేకపోవడం వల్లనో, లేక బిగ్ బాస్ సరైన టాస్కులు ఇవ్వకపోవడం వల్లనో తెలియదు కానీ, సీజన్ 7 రేంజ్ లో మాత్రం సీజన్ 8 లేదు. గత సీజన్ అంత పెద్ద హిట్ అయ్యినప్పటికీ కూడా ఈ సీజన్ కి తక్కువ బడ్జెట్ ని ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొంతమంది పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ని లోపలకు పంపాలి అనే ప్లాన్ ఎప్పటి నుండో ఉంది.

    కొంతమంది టాప్ కంటెస్టెంట్స్ అని అడగగా వస్తాము కానీ, అంతకు ముందు ఇచ్చిన రెమ్యూనరేషన్ కి డబుల్ ఇస్తామంటేనే వస్తాం అని అంటున్నారట. దీంతో బిగ్ బాస్ కొంతమంది క్రేజీ కంటెస్టెంట్స్ విషయంలో వెనకడుగు వేసిందట. అయితే ప్రస్తుతం ఖరారైన కంటెస్టెంట్స్ లో గౌతమ్ కూడా ఉన్నాడు. గత సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైన 5 మంది కంటెస్టెంట్స్ లో గౌతమ్ కూడా ఒకడు. ‘అశ్వథామ 2.0’ గా ఆయన రీ ఎంట్రీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి మార్కు ని క్రియేట్ చేసిన కంటెస్టెంట్ ఆయన. టాస్కులు కూడా అద్భుతంగా ఆడగలడు, టాప్ 5 లోకి కచ్చితంగా వస్తాడని అనుకున్నారు కానీ 13 వ వారం ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ కి రాకముందు గౌతమ్ అంటే ఎవరో ఎవరికీ తెలియదు. అలా ప్రేక్షకులకు పరిచయం లేని వాడు చివరి వారం వరకు ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా రావడం చిన్న విషయమేమి కాదు. అందుకే బిగ్ బాస్ టీం ఆయనను రీ ఎంట్రీ కోసం సంప్రదించింది.

    వచ్చే వారం ఆయన ‘అశ్వథామ 3.0’ గా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. రెమ్యూనరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేసాడట. ఒక వారానికి గాను ఆయన్న 5 లక్షల రూపాయిలు అడిగాడట. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే ఇది ఎక్కువ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు. అంతే కాదు గౌతమ్ కి రెమ్యూనరేషన్ మొదటి వారం నుండి లెక్క వేసి ఇవ్వబోతున్నారట. ఇలాంటి బంపర్ ఛాన్స్ ఎవరికి వస్తుంది చెప్పండి. సీజన్ 7 నుండి గౌతమ్ తో పాటు నయనీ పావని కూడా రాబోతుందట. అలాగే ముక్కు అవినాష్, హరి తేజ, యాంకర్ రవి వంటి ప్రముఖులతో పాటు 2 వ వారం లో ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది.