Chiranjeevi And Balakrishna: మెగాస్టార్ చిరంజీవి కి ఈ ఏడాది అద్భుతంగా కలిసొచ్చింది అని చెప్పొచ్చు. ఈ ఏడాదిలో ఆయన హీరో గా నటించిన సినిమా విడుదల కాలేదు కానీ, ఆయనకు మాత్రం పురస్కారాల వెల్లువ కురుస్తూనే ఉంది. ఏడాది ప్రారంభం లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. అప్పట్లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే ఆయన అత్యధిక డ్యాన్స్ స్టెప్పులు వేసిన హీరో గా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లోకి కూడా ఎక్కాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయనకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(IIFA) అవార్డు కూడా దక్కింది. ‘అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ క్యాటగిరీ లో మెగాస్టార్ కి ఈ అవార్డు దక్కింది.
అబుదాబి లో అట్టహాసం గా జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ సూపర్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. చిరంజీవి తో సమకాలీన హీరోలుగా పిలవబడే విక్టరీ వెంకటేష్, నందమూరి బలకృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డు ని మెగాస్టార్ అందుకున్నాడు. చిరంజీవి అవార్డు రాగానే ఎంతో సంతోషంతో బాలయ్య బాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ఘటన అక్కడికి వచ్చిన వాళ్ళందరి కళ్ళను చెమర్చాయి. రీసెంట్ గానే బాలయ్య బాబు కి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి పాల్గొని బాలయ్య గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. ఇప్పుడు బాలయ్య బాబు కూడా మెగాస్టార్ గురించి అంతే గొప్పగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇలాంటి అవార్డు అందుకోవడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న వ్యక్తి నా సోదరుడు చిరంజీవి గారు. ఆయనకు ఇలాంటి గౌరవం దక్కడం మా అందరికి దక్కిన గౌరవం కూడా భావిస్తున్నాము. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాన్న గారి తర్వాత ప్రేక్షకులను ఆ స్థాయిలో అలరించి తనదైన ముద్ర వేసుకున్న హీరోలలో చిరంజీవి గారు ఒకరు’ అంటూ బాలయ్య బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ కి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇలా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఒకే వేదిక మీద కనిపించిన ఫోటోలను చూసి అభిమానులు ఎంతో మురిసిపోయారు. నాగార్జున కూడా వచ్చునంటే గత జనరేషన్ టాప్ 4 హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసినట్టుగా అనిపించేది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అనే భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘భింబిసారా’ ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.