Hit 3 Movie : సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదలకు దగ్గర్లో లేవు, థియేటర్స్ లో జనాలు లేక ఖాళీగా ఈగలు తోలుకుంటున్నాయి, కొన్ని చోట్ల అయితే థియేటర్స్ ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. రీసెంట్ గా వచ్చిన మీడియం రేంజ్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు అందరి చూపు నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన ‘హిట్ 3′(Hit 3 Movie) వైపే. బయ్యర్స్ ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. టీజర్, ట్రైలర్ వంటివి ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెంచేసాయి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు కనివిని ఎరుగని యాక్షన్ కమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అవుతుంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కేవలం నార్త్ అమెరికా నుండే బుకింగ్స్ ద్వారా లక్ష డాలర్లు ఈ చిత్రానికి వచ్చాయి.
Also Read : చావా’ ని వెనక్కి నెత్తిన ‘కోర్ట్’..బ్రహ్మరథం పడుతున్న హిందీ ఆడియన్స్!
కచ్చితంగా ప్రీమియర్స్ కి 5 లక్షలకు పైగా గ్రాస్ వస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాకు నిర్మాత కూడా నాని అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు నిర్మాతగా మీడియం బడ్జెట్ తో నిర్మిస్తూ వచ్చిన నాని, ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేసాడు. మరి ఆ ఖర్చు తగ్గ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందా లేదా?, థియేట్రికల్ రైట్స్ ఇంతకు అమ్ముడుపోయాయి?, నాన్ థియేట్రికల్ రైట్స్ ఇంతకు అమ్ముడుపోయాయి?, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఎంత గ్రాస్ రాబట్టాల్సిన అవసరం ఉంది వంటివి ఇప్పుడు మనం క్లుప్తంగా ఈ కథనం లో చూడబోతున్నాము. నైజాం ప్రాంతంలో నాని కి మంచి క్రేజ్ ఉంది అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన గత చిత్రాలు ఈ ప్రాంతంలో ఊహకు మించి ఎక్కువ వసూళ్లను రాబట్టాయి. అందుకే ఈ సినిమాని 12 కోట్ల రూపాయలకు ఈ ప్రాంతంలో కొనుగోలు చేసారు.
పాజిటివ్ టాక్ వస్తే కేవలం వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్, సీడెడ్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 32 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 42 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ ని జరుపుకుంది. సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే కచ్చితంగా 42 కోట్ల రూపాయిల షేర్, 78 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఇక నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని అన్ని భాషలకు కలిపి 54 కోట్ల రూపాయలకు డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిందట. ఓవరాల్ గా థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ కలిపి ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయిల బిజినెస్ విడుదలకు ముందే జరిగింది.
Also Read : 53 శాతం వసూళ్లు డ్రాప్..హిట్ టాక్ తో కూడా ఫ్లాప్ వైపు అడుగులు వేస్తున్న ‘కేసరి 2’