Homeఎంటర్టైన్మెంట్Game Changer : గేమ్ చేంజర్ 'నానా హైరానా' లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది..చెవుల్లో అమృతం...

Game Changer : గేమ్ చేంజర్ ‘నానా హైరానా’ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది..చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది..వింటేజ్ శంకర్ మార్క్!

ఈ పాటలో మరోసారి గుర్తు చేసాడు. అయితే విజువల్స్ మీద ఆడియన్స్ నుండి కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సరికొత్త టెక్నాలజీ ఉన్న కెమెరాతో చిత్రీకరించి ప్రయోగం చేసారు.

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం జనవరి 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ అయితే ఇండియా వైడ్ గా బ్లాస్ట్ అనే చెప్పాలి. యూట్యూబ్ లో దాదాపుగా 80 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఇండియన్ 2’ చిత్రం తర్వాత శంకర్ మళ్ళీ కం బ్యాక్ ఇస్తాడా అని అందరూ అనుకున్నారు. కానీ ‘గేమ్ చేంజర్’ ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత ఒకప్పటి వింటేజ్ శంకర్ మళ్ళీ నిద్రలేచినట్టుగా అనిపించింది. కాసేపటి క్రితమే ఈ సినిమా నుండి ‘నానా హైరానా’ అనే మెలోడీ సాంగ్ విడుదలైంది. మొన్న ఈ సాంగ్ కి సంబంధించిన చిన్న ప్రోమో విడుదల చేయగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

కచ్చితంగా పూర్తి పాట విడుదల అయ్యాక వేరే లెవెల్ రీచ్ ఉంటుందని అనుకున్నారు ఫ్యాన్స్. శ్రేయ ఘోషల్, కార్తిక్ పాడిన ఈ పాట చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపించింది. థమన్ నుండి చాలా కాలం తర్వాత క్లాసిక్ వర్క్ ఈ పాట కోసం చేసాడని చెప్పొచ్చు. ఈ పాట ని తెరకెక్కించడం కోసం డైరెక్టర్ శంకర్ ఇన్ ఫ్రా రెడ్ కెమెరా ని ఉపయోగించాడు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎవ్వరూ కూడా ఈ కెమెరా ని ఉపయోగించలేదు. ఈ కెమెరా కారణంగా విజువల్స్, కలర్స్ చాలా డిఫరెంట్ గా కనిపించాయి. మన మొబైల్స్, కంప్యూటర్ స్క్రీన్స్ మీద చూస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే, ఇక సిల్వర్ స్క్రీన్ మీద ఈ విజువల్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి.

ఇకపోతే ఈ పాటలో రామ్ చరణ్ లుక్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. కొన్ని షాట్స్ లో మెగాస్టార్ చిరంజీవి కుర్ర ఏజ్ లో ఉన్నప్పటి లుక్స్ ని గుర్తు చేసాడు రామ్ చరణ్. పోనీ టైల్ ఎప్పుడో ఆయన ‘మగధీర’ సమయంలో వేసుకున్నాడు. మళ్ళీ ఈ సినిమా కోసమే ఆయన పోనీ టైల్ వేసుకున్నాడు. ఈ లుక్ లో రామ్ చరణ్ చాలా హాట్ గా ఉన్నాడు. కెరీర్ ప్రారంభం సమయంలో రామ్ చరణ్ లుక్స్ ఎలా ఉండేవో, ఇప్పుడు కూడా అలా ఉన్నాయి. హీరోయిన్ కైరా అద్వానీ కూడా సాంగ్ లో మెరిసిపోతుంది. ఓవరాల్ గా ఒకప్పటి శంకర్ సినిమాల్లో పాటలు ఎలా ఉండేవో, విజువల్స్ ఎలా ఉండేవో, ఈ పాటలో మరోసారి గుర్తు చేసాడు. అయితే విజువల్స్ మీద ఆడియన్స్ నుండి కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సరికొత్త టెక్నాలజీ ఉన్న కెమెరాతో చిత్రీకరించి ప్రయోగం చేసారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper