Gabbar Singh: పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ కి 11 ఏళ్ళు.. ఈ చిత్రం నెలకొల్పిన అనితర సాధ్యమైన రికార్డ్స్ ఇవే!

పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఒక వరం లాగ భావించాడు హరీష్ శంకర్.తన టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించి,ఈ స్క్రిప్ట్ ని తయారు చేసాడు. కేవలం పేరుకి మాత్రమే ఈ చిత్రం 'దబాంగ్' రీమేక్.

Written By: Vicky, Updated On : మే 11, 2023 3:00 సా.

Gabbar Singh

Follow us on

Gabbar Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై నేటికీ 11 ఏళ్ళు పూర్తి అయ్యింది. పవన్ కళ్యాణ్ కి ఖుషి తర్వాత అన్ని యావరేజీలు మరియు ఫ్లాప్స్ తగులుతూ ఉన్నాయి, మధ్యలో జల్సా సినిమా ఒక్కటి కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది, కానీ అది కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ హిట్ కాదు. ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం తిరగరాసే సినిమా కోసం ఎదురు చూస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ కి జల్సా తర్వాత పులి, తీన్ మార్ మరియు పంజా ఇలా వరుసగా మూడు ఘోరమైన డిజాస్టర్స్ పడ్డాయి. ఇక పవన్ కళ్యాణ్ పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో వచ్చింది ‘గబ్బర్ సింగ్’ చిత్రం. అప్పుడే మిరపకాయ్ అనే సూపర్ హిట్ సినిమాని తీసి మంచి ఊపు మీద ఉన్న హరీష్ శంకర్ కి గబ్బర్ సింగ్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఒక వరం లాగ భావించాడు హరీష్ శంకర్.తన టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించి,ఈ స్క్రిప్ట్ ని తయారు చేసాడు. కేవలం పేరుకి మాత్రమే ఈ చిత్రం ‘దబాంగ్’ రీమేక్. కానీ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం డిఫరెంట్,అసలు దబాంగ్ కి గబ్బర్ సింగ్ కి పోలికే ఉండదు, మొత్తం పవన్ కళ్యాణ్ స్టైల్ కి మార్చి, అద్భుతమైన డైలాగ్స్, అదిరిపొయ్యే రేంజ్ ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించేలా చేసాడు. సరైన హిట్ కోసం ఆకలితో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి ధమ్ బిర్యానీ దొరికినట్టు అయ్యింది.మొదటి రోజు ఈ సినిమాని చూసి బయటకి వచ్చిన అభిమానుల ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. అలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ ఊచకోత ప్రారంభించింది.

ఇప్పుడు బాహుబలి సినిమా ఎలాగో, అప్పట్లో మగధీర సినిమా అలా అన్నమాట.ఈ సినిమాకి దరిదాపుల్లో ఒక్క స్టార్ హీరో వెళ్లలేకపొయ్యాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం తో మగధీర ని 70 శాతం సెంటర్స్ లో దాటేశాడు. మొదటి రోజు ఆల్ టైం రికార్డ్, మొదటి వీకెండ్ ఆల్ టైం రికార్డ్, మొదటి వారం ఆల్ టైం రికార్డ్ , 50 రోజు సెంటర్స్ కౌంట్ లో ఆల్ టైం రికార్డ్,మరియు ఫుల్ రన్ ఆల్ టైం టాప్ 2 , ఇలా మొదటి రోజు నుండి ఫుల్ రన్ వరకు రికార్డుల మోత మోగించింది. అభిమానులకు ఒక తీపి జ్ఞాపకాన్ని మిగిలించింది. సుమారుగా 63 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, 307 కేంద్రాలలో 50 రోజులు, 60 కి పైగా కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. అలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ విడుదలై నేటికీ 11 ఏళ్ళు అయ్యింది, మళ్ళీ అదే డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రం కూడా ‘గబ్బర్ సింగ్’ రేంజ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.