October: క్రికెట్ టోర్నమెంట్స్ ఎన్ని వచ్చినా.. భారత్ X పాకిస్థాన్ ఇచ్చే కిక్కే వేరు. దాయాదీ దేశంతో తలపడే ఈ మ్యాచ్ ను చూడని వారుండరు. భారత్ X పాకిస్థాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల్లోని క్రీడాకారులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ఈ మ్యాచ్ పై బోలెడంత ఇన్వెస్ట్ చేస్తాయి. 2023 వరల్డ్ కప్ కు భారత్ ఆతిత్యమివ్వనుందని తెలిసింది. వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా బయటకు వచ్చింది.
అధికారికంగా ప్రకటించకపోయినా ఓ ఆంగ్ల పత్రిక తెలిపిన ప్రకారం ఇందులో గ్రూప్ ఏ లోనే భారత్, పాక్ కలిసి ఉన్నాయి. అంటే ఈ రెండు దేశాల మధ్య ఒక్క మ్యాచ్ అయినా ఉంటుందని ఎప్పుడో అనుకున్నారు. తాజాగా ఈ మ్యాచ్ తేదిని ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్ లోనే తెలంగాణ ఎన్నికల ఫీవర్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఓవైపు ఎలక్షన్స్.. మరోవైపు భారత్ X పాకిస్థాన్ మ్యాచ్ తో సిటీ హాట్ హాట్ గా మారనుంది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ స్టేడియంలో మొదటి మ్యాచ్ డిపెండింగ్ చాంపెయిన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. 46 రోజుల పాటు 48 మ్యాచ్ ల దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో ఆడనున్నారు. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలోనే ఆడనున్నారు. ఇక ఈ ప్రపంచ కప్ లో భారత్ తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభించనుంది. అయితే షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ తో అహ్మదాబాద్ లోనే ఆడాల్సి ఉంది.
కానీ భద్రతా విషయంలో పీసీబీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో పీసీబీ చీఫ్ నజామ్ సేథీ దుబాయ్ లోని ఐసీసీ కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లోభారత్ X పాకిస్థాన్ మ్యాచ్ తో ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. దీంతో దేశంలోని మిగతా నగరాలను పరిశీలించిన తరువాత హైదరాబాద్ సేఫేస్ట్ ప్లేస్ గా నిర్ణయించారు. అంటే అక్టోబర్ 15న భారత్ X పాకిస్థాన్ మ్యాచ్ జరగనుందట.
అయితే అప్పటికే పాకిస్తాన్ చెన్నై, బెంగళూర్ లో వివిధ దేశాలతో తలపడుతుంది. అక్టోబర్ 15న మాత్రం ఇండియాతో అదీ హైదరాబాద్ లో మ్యాచ్ ఉండడంతో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఈ మేరకు హైదరాబాద్ లో నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ కు ఈ సమాచారం అందించి ఏర్పాట్లు చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల అక్టోబర్ లో ఎన్నికలు ఉంటాయని హింట్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా అక్టోబర్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో హైదరాబాద్ ఓ వైపు ఎన్నికల వేడి.. మరోవైపు భారత్ X పాకిస్థాన్ మ్యాచ్ తో హాట్ హాట్ గా మారనుంది. మరి భద్రతా విషయంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని నగర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.