Homeఎంటర్టైన్మెంట్Sameera Reddy: తన కొత్త వీడియోతో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మాజీ...

Sameera Reddy: తన కొత్త వీడియోతో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మాజీ క్రేజీ హీరోయిన్

Sameera Reddy: హాట్ హీరోయిన్ సమీరా రెడ్డి.. ఈ పేరుకి ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది సమీరా రెడ్డి. దక్షిణాదిన పలువురు యువ, స్టార్ హీరోలతో సినిమాలు చేశాక, బాలీవుడ్ కి పోయి, అక్కడా తన అందచందాలతో అక్కడి ప్రేక్షకులకు కనువిందు చేసింది.

Sameera Reddy
Sameera Reddy

ఐతే, తాజాగా సమీరా రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన వీడియోని షేర్‌ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఏ మాత్రం గ్లామర్ లేని లుక్ లో తన కూతురికి ఫుడ్ తినిపిస్తూ సమీరా కనిపించింది. ఈ విజువల్స్ మీద ‘ఇన్ స్టాగ్రామ్ లో అందమైన సమీరా రెడ్డి ఎక్కడ ?’ అని తనకు తానే ఒక ప్రశ్నను వేసుకుంది.

Also Read: Megastar Chiranjeevi: నువ్వు హీరోగా పనికి రావని మెగాస్టార్ అన్నదెవరిని?

వెంటనే, గెటప్ అండ్ సెటప్ మార్చి.. ఫుల్ మేకప్ తో హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ సమీరా రెడ్డి మళ్లీ మెరిసిపోయింది. ‘ఈ అందమైన సమీరా రెడ్డినే కదా మీకు కావాల్సింది ?’ అంటూ నెటిజన్లకు ఒక ప్రశ్న కూడా పడేసింది. మొత్తానికి సమీరా రెడ్డి ఈ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

సమీరా రెడ్డి.. తెలుగులో చిరంజీవితో ‘జై చిరంజీవ’, ఎన్ఠీఆర్ సరసన ‘నరసింహుడు, అశోక్’, హీరో సూర్యతో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమాలు చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ – సమీరా రెడ్డి కాంబినేషన్ కి ఆ రోజుల్లో ఓ రేంజ్ లో హైప్ ఉండేది. వీరి బంధం పై అప్పట్లో అనేక పుకార్లు కూడా వినిపించాయి. అలాంటి సమీరా రెడ్డి ప్రస్తుతం హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తూ.. కాలాన్ని నెట్టుకొస్తోంది.

Sameera Reddy
Sameera Reddy

పెళ్ళయ్యాక పూర్తిగా సినిమాలను దూరం పెట్టేసింది. ఆ మధ్య పలు ఆఫర్లు వచ్చినా నో చెప్పేసింది. అయితే ఈ మధ్య ఆమె సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై సమీరా రెడ్డి స్పందిస్తూ.. ‘నాకు సినిమాల్లోకి మళ్లీ వచ్చే ఉద్దేశం లేదు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే. వారికి నా అవసరం ఎంతో ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ నేను సినిమాల్లో మళ్లీ యాక్ట్ చెయ్యను’ అని సమీరా క్లారిటీగా చెప్పుకొచ్చింది.

నిజానికి సమీరా రెడ్డి 2016లో అరుదైన ‘అలోపేసియా’ వ్యాధికి గురైంది. ఆ వ్యాధిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే.. మానసికంగా బాగా కుంగదీస్తుంది. అలాంటి అరుదైన వ్యాధిని కూడా సమీరా రెడ్డి సమర్ధవంతంగా జయించింది.

Also Read:Sudigali Sudheer: జబర్దస్త్ లోకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ.. కారణం ఎవరో తెలుసా ?
Recommended Videos
బ్యూటిఫుల్ హీరోయిన్  బోల్డ్ నిర్ణయం || Crazy Heroine Shocking Decision || Tollywood Star Heroine
పుష్ప 2 కోసం బుచ్చి బాబు || Buchi Babu turned as assistant director for Pushpa 2 || Allu Arjun

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version