The Warrior Movie Collections: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘ది వారియర్’ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమాకి మొదటి రోజు నుంచే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో, కలెక్షన్స్ బాగా తగ్గాయి. మరి.. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏమిటి ?, నిర్మాతకు ఏ రేంజ్ లో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది ?. తెలుసుకుందాం రండి.
ముందుగా ఈ సినిమా 134 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: Megastar Chiranjeevi: నువ్వు హీరోగా పనికి రావని మెగాస్టార్ అన్నదెవరిని?
నైజాం 6.02 కోట్లు
సీడెడ్ 3.03 కోట్లు
ఉత్తరాంధ్ర 2.43 కోట్లు
ఈస్ట్ 1.44 కోట్లు
వెస్ట్ 1.27 కోట్లు
గుంటూరు 1.98 కోట్లు
కృష్ణా 1.03 కోట్లు
నెల్లూరు 0.97 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 14 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘ది వారియర్’ రూ. 18.46 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 36.59 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.02 కోట్లు
తమిళనాడు 0.93 కోట్లు
ఓవర్సీస్ 0.88 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 14 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘ది వారియర్’ రూ. 21.05 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 42:11 కోట్లను కొల్లగొట్టింది
ఓవరాల్ గా ‘ది వారియర్’ కలెక్షన్స్ ను ఇప్పుడు ఉన్న బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. ఈ సినిమాకి 4.3 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమాకు 20 % ఆక్యుపెన్సీ కూడా లేదు. మొత్తమ్మీద మొదటి 14 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అవ్వడం దాదాపు కష్టమే.
Also Read:Rashmika Mandanna: శృతి మించిన రష్మిక అందాలు.. కేక పెట్టిస్తున్న ఘాటు పోజులు