Employees Leaving Top IT Companies: కరోనా మహమ్మారి ఐటీ ప్రపంచాన్ని మార్చేసింది. ఎంప్లాయిస్ వర్క్ విషయంలో కంఫర్టబుల్ గా ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. అందుకే, దాదాపు సంస్థలు అన్నీ తమ ఉద్యోగులందరి చేత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటైన ఎంప్లాయిస్ ఇప్పుడు ఆఫీసులకు తిరిగి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు.

ఏ ఎంప్లాయిస్ నోట విన్నా… వర్క్ ఫ్రమ్ హోమే ముద్దు అంటున్నారు. పైగా అనవసరమైన స్ట్రెస్ ను తీసుకోవడం వేస్ట్ అంటున్నారు. ఇప్పటికే సీనియర్ ఉద్యోగులు జాబ్ మానేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారతదేశంలోని టాప్ IT కంపెనీల నుంచి జాబ్స్ వదిలేసిన ఉద్యోగుల రేషియో ఎలా ఉందో చూద్దాం.
Also Read: Spiritual Tours: దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యటనలు.. భక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు
ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో భారతీయ ఉద్యోగులలో అత్యధికంగా 28.4% ఉద్యోగులు తమ కంపెనీని విడిచిపెట్టారని ఇన్ఫోసిస్ నివేదించింది. HCL టెక్ సంస్థలో 23.8% వరకూ ఉద్యోగుల అట్రిషన్ రేటు ఉంది. ఇక విప్రో విషయానికి వస్తే 23.3% వరకూ ఉంది. అలాగే TCS విషయానికి వస్తే.. 19.7% వరకూ ఉంది.

అయితే, ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అత్యధిక సంఖ్యలో కొత్త ఉద్యోగులను చేర్చుకుంది, ఆ తర్వాత ఉద్యోగులను చేర్చుకున్న కంపెనీల్లో విప్రో, TCS మరియు HCL టెక్ ఉన్నాయి. తాజాగా రిక్రూట్‌మెంట్ బాగానే జరుగుతుందని తెలుస్తోంది. ఇంతకీ జాబ్ ఎందుకు వదిలేస్తున్నారు అంటే.. బిజినెస్ పై ఆసక్తి చూపిస్తున్నారు.
మొత్తానికి చదువుకున్న వాడికంటే చదువులేనోడే నయం అన్నది పాత సామెత. కార్పొరేట్ కొలువుకు కన్నా బిజినెస్ బెటర్ అనేది నేటి సామెత అంటున్నారు సీనియర్ ఎంప్లాయిస్.
Also Read:KTR Birthday: నడిరోడ్డుపై కేటీఆర్ జన్మదిన వేడుకలా?