Tollywood Celebrities Favorite Food: అందంగా ఉండి.. ఆడియన్స్ ను ఆకర్షించే వారే హీరోయిన్లుగా రాణిస్తారు. అందు కోసం డైట్ మెయింటైన్ చేయాలి. అంతకుముందు ఎలా ఉన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే తిండిని కంట్రోల్ చేయకతప్పదు. లేకపోతే లావైపోతారు. మంచి శరీరాకృతి ఉండాలంటే అవసరమైన ఎక్సైర్ సైజ్ చేస్తూ మితంగా ఫుడ్ ను తీసుకోవాలి. ఇలా చేయబట్టే చాలా మంది హీరోయిన్లు ఇంకా సినిమాల్లో కొనసాగుతున్నారు. కానీ ఒక్కోసారి వారికిష్టమైన ఆహారం కనిపిస్తే అన్ని మరిచిపోతారు. అవసరానికి మించి లాగించేసి తృప్తి పొందుతారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగువాళ్లకంటే ఇతర ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మలే ఎక్కువగా ఉన్నారు. వీరు మొదటి నుంచి ప్రత్యేకమైన ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకుంటున్నారు. ఒక్కోసారి వారికిష్టమైన ఆహారం కనిపిస్తే మాత్రం వాటిని తినేదాక వదలరు. రోజుకు ఒక్కసారైనా వారికిష్టమైన ఫుడ్ ను తీసుకొని మిగతా సమయాల్లో డైటింగ్ చేస్తారు. అసలు ఏ హీరోయిన్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంది..? ఎవరు వేటిని బాగా ఇష్టంగా తింటారు..?
సమంత:
మొన్నటి వరకు సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ అయిన సమంత ఇప్పుడు బాలీవుడ్లోనూ దూసుకుపోతుంది. ఈ భామ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతోంది. అయినా ఇప్పటికీ అదే ఫిజిక్. కారణం ఆమె తీసుకునే ఫుడ్. సమంత ఎక్కువగా పాల పదార్థాలను తీసుకుంటుంది. పాలకోవ, డైరి మిల్క్, చాక్లెట్, చక్కెర పొంగల్, సుషీ ఇష్టంగా తింటుంది. వాస్తవానికి తీపి పదార్థాలతో లావవుతారు. కానీ సమంత అప్పుడప్పుడు మాత్రమే వీటిని తీసుకుంటుంది.

కాజల్ అగర్వాల్:
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇటీవలే ఈ భామ ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లయింది. కానీ ఇప్పటికీ ఆమె అందంగానే కనిపిస్తారు. సినిమాల్లో ఉన్నంతకాలం కాజల్ డైట్ మెయింటేన్ చేసేది.అయితే హైదరాబాద్ బిర్యానీ అండే పడి చచ్చేదట. వారానికి రెండుసార్లైనా బిర్యానీ రుచి చూడకుండా నిద్రపోయేది కాదట.

తమన్నా భటియా:
ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తోంది తమన్నా. మొదట్లో కంటే ఇప్పుడే ఇంకా అందంగా తయారైంది. సినిమాల్లో అవకాశాలు తగ్గినా ఫుడ్ కంట్రోల్ లోనే ఉంచుతుందట. ఈ అమ్మడు కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటుందట.

అనుష్క షెట్టి:
‘బాహుబలి’ రాణి అనుష్క శెట్టిని వెండితెరపై చూడనిదే అస్సలు నిద్రపట్టేది కాదు యూత్ కి. అయితే ఆమె సినిమాల్లో కనిపించకపోయేసరికి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. యోగా టీచర్ అయిన అనుష్క ఆహారాన్ని ఎలా తీసుకోవాలో ఆమెకు ఒకరు చెప్పాల్సిన పనిలేదు. అయినా అనుష్క చికెట్ వంటకాలను ఇష్టంగా లాగించేస్తుందట.

రకుల్ ప్రీత్ సింగ్:
సినీ పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సన్నగా కనిపించే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈమెకు ఆలూ పరాటా, గులాబ్ జాబ్ అంటే చాలా ఇష్టమట. వాటి కోసం భోజనాన్నే పక్కనపెడుతుందట.

కీర్తి సురేశ్:
తమిళ భామ కీర్తి సురేశ్ సాంప్రదాయ వంటకాలనే ఎక్కువగా ఇష్టపడుతారు. ఇందులో ఆమెకు దోశ అంటే చాలా ఇష్టమట.

పూజా హెగ్డే:
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే బిర్యానీ కోసం ఎదురుచూస్తూ ఉంటుందట. అవకాశం వచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా లాగించేస్తుందట. అలాగే పిజ్జా అంటే కూడా ఈ భామకు తెగ ఇష్టమట.

రష్మిక మదానా:
ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లలో సూపర్ స్టార్ హీరోయిన్ రష్మిక మందానానే. ఈ భామ దోశ లంటే పడి చస్తుందట.

రాశిఖన్నా:
తెలుగులో పెద్దగా కనిపించకపోయినా తమిళ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది రాశీఖన్నా. ఈ భామకు చైనా ఫుండ్ అంటే చాలా ఇస్టమట.

నిత్యామీనన్:
కాస్త బొద్దుగా కనిపించినా అందంగానే ఉండే నిత్యామీనన్ దక్షణాది వంటకాన్నింటినీ ఆరగించేస్తుందట. అలాగే స్వీట్లు కూడా ఎక్కువగా తీసుకుంటుందట.

https://youtu.be/2z4-K6DA9Jk