Fauji : ప్రభాస్(Rebel Star Prabhas) నటిస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉత్కంఠ లేపిన చిత్రం ‘ఫౌజీ'(Fauji Movie). ‘సీతారామం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ఇది. పీరియాడిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా ఇమాన్వి(Imanvi Ismail) అనే కొత్త హీరోయిన్ ని తీసుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీగా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మాయికి మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కోసం చకోరి పక్షులు లాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇమాన్వి కూడా చూసేందుకు చాలా క్యూట్ గా ఉండడంతో కచ్చితంగా ఈమె పెద్ద హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు.
Also Read : ప్రభాస్ ఫౌజీ లో ఊహించని విలన్ ను తీసుకువస్తున్నారా..? ఇంతకీ ఎవరతను..?
అయితే ఈ అమ్మాయి మన దేశానికీ చెందిన అమ్మాయి కాదు, శత్రు దేశమైన పాకిస్థాన్ కి చెందిన అమ్మాయి. ఈమె తండ్రి పాకిస్థాన్ గతంలో పాకిస్థాన్ మిలటరీ లో పనిచేసాడట. పాకిస్థాన్ లోని కరాచీ ప్రాంతానికి చెందిన అమ్మాయి ఈమె. ఈ సినిమా ప్రారంభం కి ముందు ఆమె అమెరికా లో నివసిస్తూ ఉండేది. ఈమె మూలాలు మొత్తం పాకిస్థాన్ లో ఉన్నప్పటికీ ఢిల్లీ లో పుట్టి పెరిగింది. కానీ మొన్న కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన మరణ హోమం పై భారత దేశ ప్రభుత్వం ఎంత ఫైర్ మీద ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశం లో పాకిస్థాన్ కి ఇండియా కి ఉన్న సంబంధాలని మొత్తం కట్ చేసేసారు. అంతే కాకుండా ఇండియా లో ఉంటున్న పాకిస్థాన్ సిటిజన్స్ ని 48 గంటలోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది ఇండియన్ ప్రభుత్వం. అంతే కాకుండా భవిష్యత్తులో కూడా ఇండియా, పాకిస్థాన్ మధ్య రాకపోకలు ఉండవని స్పష్టం చేసింది.
మరి పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన ఇమాన్వి ఇప్పుడు ఇండియా లోనే షూటింగ్ కోసం ఉంటుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి?, కచ్చితంగా మన ఇండియా వదిలి వెళ్లిపోవాల్సిందేనా?, ఇక మీదట ఈమె షూటింగ్ లో కూడా పాల్గొనడానికి వీలు లేదా?, ఇప్పటికే ఈమెపై బోలెడన్ని సన్నివేశాలు చిత్రీకరించారు, ఒకవేళ భారత ప్రభుత్వం ఈమెని అనుమతించకపోతే ఆ సన్నివేశాలన్నీ వృధా అయ్యినట్టేనా?, మళ్ళీ వాటిని వేరే హీరోయిన్ తో రీ షూట్ చేయాలా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అభిమానులు కూడా కాశ్మీర్ ఘటన పై పాకిస్థాన్ పై ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ఈ నేపథ్యం లో ఇమాన్వి ని తొలగించడమే మంచిది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిక్కుముడి నుండి మూవీ టీం ఎలా బయటపడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. ఏకంగా యువరాణిగా పట్టాభిషేకం చేశారుగా