https://oktelugu.com/

Fauji : ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. ఏకంగా యువరాణిగా పట్టాభిషేకం చేశారుగా

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మరిపోయారు ప్రభాస్.. అప్పటి నుంచి ఆయన భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నారు. గతేడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన వరుస పెట్టి సినిమాలను చేస్తున్నారు.

Written By: , Updated On : February 16, 2025 / 05:58 PM IST
Alia Bhatt in Prabhas' movie

Alia Bhatt in Prabhas' movie

Follow us on

Fauji : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మరిపోయారు ప్రభాస్.. అప్పటి నుంచి ఆయన భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నారు. గతేడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన వరుస పెట్టి సినిమాలను చేస్తున్నారు. ఆయన ఖాతాలో రాజసాబ్, కల్కి 2, సలార్ 2, స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో ల‌వ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ‘పౌజీ’ చిత్రాన్ని తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వ‌కుండా చిత్రీక‌ర‌ణ జరుపుకున్నారు. వీలైనంత వేగంగా ‘పౌజీ’ పూర్తి చేసి త‌దుప‌రి సినిమాలు మొద‌లు పెట్టాల‌నే ఆలోచనలో ప్రభాస్ పని చేస్తున్నాడు. పౌజీలో ప్రభాస్ కు జోడీగా ఇమాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అమ్మ‌డు లాంచింగ్ రోజే కుర్రాళ్ల మ‌న‌సు దోచేసింది.

తనకు గతంలో హీరోయిన్ గా చేసిన అనుభ‌వం లేదు. కానీ సోష‌ల్ మీడియాలో అమ్మ‌డి ఫాలోయింగ్ చూసిన హ‌ను ప్రభాస్ కు ప‌ర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుందని భావించాడు. ఇక ఈ ల‌వ్ అండ్ వార్ లో హీరో-హీరోయిన్ మ‌ధ్య అంద‌మైన ప్రేమ క‌థ‌ని చెప్ప‌బోతున్నాడు. సినిమాలో ఎక్కువ‌గా హైలైట్ చేసేది ఈ అంశాన్నే. ల‌వ్ స్టోరీలు తెర‌కెక్కించ‌డంలో హ‌ను స్పెష‌లిస్ట్ అన్న సంగ‌తి అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి వార్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియాకు కనెక్ట్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేప‌థ్యంలో సినిమా గురించి మ‌రో ఆసక్తికర విషక్ష్ం లీకైంది. ఇదే సినిమాలో బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ అలియాభట్ కూడా న‌టిస్తుందిట‌. ఇందులో అమ్మ‌డు ఓ యువ‌రాణి పాత్ర‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సినిమా లో ఈ పాత్ర ఓ గెస్ట్ రోల్ లా క‌నిపించనుందని టాక్. ఫేమ‌స్ హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని అలియాభ‌ట్ ని సంప్ర‌దించ‌గా? అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లు ప్రచారం జరుగుతున్నాయి.

ఇదే నిజమైతే ఫౌజీ క్రేజ్ మరింత పెరుగుతుంది. అలియాభ‌ట్ ఎంట్రీ అంటే మరి మామూలుగా ఉండదు సినిమా. ఇప్ప‌టికే అమ్మ‌డు తెలుగులో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో సీత పాత్ర‌తో ఆడియ‌న్స్ కి చాలా దగ్గర అయింది. కాసేపు క‌నిపించే పాత్ర అయినా అమ్మ‌డు ఒదిగిపోయిన విధానానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ప్రభాస్ పౌజీలోనూ ఎంట్రీ ఇస్తే సినిమా మరో రేంజ్ కు వెళ్లుతుందని అంటున్నారు.