Midday Meal: ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల్లో సైతం మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈరోజు నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 12న తిరిగి పాఠశాలలు తెరుచుకొనున్నాయి. అయితే ఈ వేసవి సెలవుల్లో సైతం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. అయితే ఇది కేవలం కరువు ప్రాంతంలోని పాఠశాలల్లో మాత్రమే పథకం అమలు చేస్తారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చిస్తుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. కరువు ప్రాంతాల్లోని విద్యార్థులకు వేసవి లో భోజనం అందించాలని హైకోర్టులో ఒక పిల్ దాఖలయింది. అయితే దానిని న్యాయస్థానం కొట్టేసింది. కరువు ప్రాంతాల్లో మధ్యాహ్నం భోజనం కొనసాగుతుందని విద్యాశాఖ స్పష్టం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: మళ్లీ రిమాండ్.. వల్లభనేని వంశీ విడుదల ఎప్పుడు?
* హైకోర్టులో పిటిషన్..
ప్రభుత్వ పాఠశాలలతో( Government schools) పాటు జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలవుతున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి పాఠశాలలు మూతపడడంతో మధ్యాహ్న భోజనం సైతం నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో కరువు ప్రాంతాల్లోని విద్యార్థులకు వేసవిలో భోజనం అందించాలని కాకినాడకు చెందిన ఓ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి హైకోర్టులో పిల్ వేశారు. అయితే కరువు ప్రాంతాల్లో మధ్యాహ్నం భోజనం అమలు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో కోర్టు ఆ పిల్ ను తిరస్కరించింది. కరువు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్నం భోజనం అందించాలని కోరారు. పిల్లలకు పోషకాహారం ఉచితంగా పొందే హక్కు ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.
* ఆ 87 మండలాల్లో..
అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. 2024 మార్చి 16న జారీచేసిన జీవో ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాల్లోని 87 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించిన విషయాన్ని విద్యాశాఖ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్నం భోజనం అందించడం లేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే దీనిపై ఆదేశాలు ఇచ్చామని.. కరువు ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుందని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. మరోవైపు ఇంటర్ కు సంబంధించి ఏప్రిల్ ఒకటిన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 1న మళ్లీ కాలేజీలు తెరవనున్నాయి. అంతవరకు కరువు ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం కొనసాగుతుంది.
Also Read: బెంగళూరులో వ్యూహకర్తలతో జగన్!