https://oktelugu.com/

Trivikram Srinivas: త్రివిక్రమ్ పెన్ను లో ఇంకు అయిపోయిందా..?

త్రివిక్రమ్ రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక భారీ అల్ట్రా డిజాస్టర్ ని అందుకోవడంతో ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చిందనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : January 14, 2024 / 11:19 AM IST

    Trivikram Srinivas

    Follow us on

    Trivikram Srinivas: ఒకప్పుడు రైటర్ గా గొప్ప సినిమాలకు కథ మాటలు అందిస్తూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకొని స్టార్ హీరోలకు సైతం అదిరిపోయే సక్సెస్ లను ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తరుణ్ హీరో గా వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తనకంటూ ఇండస్ట్రీలో ఒక భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి త్రివిక్రమ్ రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక భారీ అల్ట్రా డిజాస్టర్ ని అందుకోవడంతో ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చిందనే చెప్పాలి. ఇక దాంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా త్రివిక్రమ్ పెన్ను లో ఇంకు అయిపోయిందా అంటూ ఆయన్ని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

    మరి దీనిపైన త్రివిక్రమ్ ఏ రకంగాను స్పందించడం లేదు. నిజానికి త్రివిక్రమ్ సక్సెస్ కొట్టిన సినిమాలను కూడా ఆ సినిమా నుంచి స్టోరీని కాపీ చేశాడు ఈ సినిమా నుంచి ఆ సీన్ ని కాపీ చేసాడు అంటూ పలు రకాల విమర్శలు అయితే వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఏకంగా సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన మీద ట్రోలింగ్స్ విమర్శలు విపరీతంగా వస్తున్నాయి.

    వీటిని ఎలా ఎదుర్కొంటాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇంతకు ముందు త్రివిక్రమ్ ఒక పంచ్ డైలాగ్ రాశారంటే దానికి చాలా డెప్త్ ఉంటుందని అందరు మాట్లాడుకునేవారు. కానీ గుంటూరు కారం సినిమాలో ఆయన డైలాగులు చూసిన తర్వాత త్రివిక్రమ్ ఇక గురూజీ ఫేడ్ అవుట్ దశకి వచ్చేసాడు అంటూ చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ తనని తాను అప్డేట్ చేసుకొని కథలు రాసుకొని సినిమాలు తీస్తే తప్ప ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్లతో పోటీపడలేడు…

    ఎందుకంటే ఇప్పుడు వస్తున్న యంగ్ దర్శకులు అందరూ కూడా కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక ఆడియన్స్ కూడా రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలని చూడటానికి ఆసక్తిని చూపించడం లేదు. ఏవైతే కొత్తదనం చూపించే సినిమాలు వస్తున్నాయో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.ఆ సినిమాలో హీరో కొత్త వాడా లేదా యంగ్ హీరోనా, స్టార్ హీరోనా అనే తేడా చూడకుండా కాన్సెప్ట్ కి మాత్రమే వాల్యూ ఇస్తున్నారు.కాబట్టి త్రివిక్రమ్ కూడా ఇప్పుడు తన పెన్నులో కొత్త ఇంకు పోసుకొని కొత్త కథలు రాస్తే బెటర్ గా ఉంటుందంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…