Chiranjeevi And Ram Charan: చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత సినిమా తో తనకంటు ఒక ప్రత్యేక ఇమేజ్ ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రామ్ చరణ్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన డ్యాన్ లతో, ఫైట్లతో, నటనతో తనకు సపరేట్ ఫాలోయింగ్ ని అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈయన చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా రోజు రోజుకు లేట్ అవుతూ వస్తుంది.
దానివల రామ్ చరణ్ కొంతవరకు సఫర్ అవుతున్నప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం మెగా అభిమానులందరికీ ఈ సినిమా ఒక గొప్ప విజయాన్ని అందిస్తుందనే ఒక నమ్మకం వల్లే లేట్ అవుతున్న కూడా రామ్ చరణ్ ఓపిక గా సినిమా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో రామ్ చరణ్ చేసే సినిమాల కథలు మొత్తం చిరంజీవి వింటూ ఓకే చేసేవాడు అలా చిరంజీవి పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పుడు మగధీర, ఆరెంజ్ సినిమాల తర్వాత తమిళ్ దర్శకుడు ఆయన ధరణి రామ్ చరణ్ కాజల్ ని పెట్టి మెరుపు అనే సినిమా చేయాలనుకున్నాడు.
ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించి సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత ఈ విషయం తెలిసిన చిరంజీవి సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ మొత్తం విని సినిమా షూటింగ్ కి చిరంజీవి కూడా పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆ సినిమా అనుకున్న బడ్జెట్ కంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ అవుతుండటంతో చిరంజీవి ఆ సినిమాను ఆపేసాడు. ఎందుకంటే అంతకు ముందే ఆరెంజ్ సినిమా భారీ ప్లాప్ అయి ప్రొడ్యూసర్ అయిన నాగబాబు కి భారీ నష్టాలని మిగిల్చింది.
ఇక దానివల్ల ఇక మీదట వచ్చే సినిమాల బడ్జెట్ ఎక్కువగా పెరగకుండా ప్రొడ్యూసర్ కూడా సేఫ్ గా ఉండాలనే విధంగా చిరంజీవి ఆలోచించి ఈ సినిమాని క్యాన్సిల్ చేశాడు.అయితే చిరంజీవి డైరెక్టర్ తో మాట్లాడి బడ్జెట్ కొంచం తగ్గించమని చెప్పిన కూడా ఆ డైరెక్టర్ తగ్గించకపోవడంతో చిరంజీవి ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సల్ చేసి సంపత్ నంది డైరెక్షన్ లో రచ్చ సినిమా ఒకే చేశాడు…ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది…