Bigg Boss 10 Telugu: ఈ వారం రోహిత్ ఆట పై ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో ఓట్లు వేస్తూ నిన్ను టైటిల్ విన్నర్ ని చేద్దామని అనుకుంటే , నువ్వేమో షాలిని తో లవ్ ట్రాక్ నడుపుతూ గేమ్ ని చెడగొట్టుకుంటున్నావ్ అంటూ రోహిత్ ని ట్యాగ్ చేసి పోస్టులు వేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ వారం రోహిత్ ఆటని చూసి ఆయన అభిమానులు ఏడవడం ఒక్కటే తక్కువ. ఎందుకంటే నామినేషన్స్ సమయం లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అందరూ రోహిత్ ని అత్యంత దారుణంగా టార్గెట్ చేశారు. వంశీ , త్రిగున్, సుధీర్ అయితే రోహిత్ ని కనీవినీ ఎరుగని రేంజ్ లో రోస్ట్ చేసి వదిలారు. దానికి ప్రతీ కారంగా రోహిత్ తన అద్భుతమైన ఆటతో సెలబ్రిటీలకు సమాధానం చెప్తాడు , ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ స్టఫ్ ఇస్తాడని ఆశించారు. కానీ కట్ చేస్తే ఆయన షాలిని తో లవ్ ట్రాక్ లో మునిగి తేలుతున్నాడు.
ఈ వారం రోహిత్ టీం కి తక్కువ మార్కులు రావడానికి ప్రధాన కారణం రోహిత్ మాత్రమే. రెండవ టాస్క్ లో తానూ వెళ్లకుండా షాలిని ని పంపడమే ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. దాని కారణంగా డేంజర్ జోన్ లోకి రావాల్సి వచ్చింది. ఇక నేటి ఎపిసోడ్ లో కూడా నాగార్జున రోహిత్ కి గట్టి క్లాస్ పీకాడట. అన్నం తినకుండా పారేయడం తో పాటు, ఈ వారం మొత్తం నీ గేమ్ సున్నా అయిపోయిందని , ఎవరితో ఉండడం వల్ల అయ్యిందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని అన్నాడట. అంతే కాకుండా ఒక అభిమాని చేత రోహిత్ తో మాట్లాడిస్తూ , షాలిని తో లవ్ ట్రాక్ వల్ల నీ గేమ్ మొత్తం పోయింది , చాలా కోపం గా ఉంది మీ మీద అంటూ రోహిత్ ని కడిగిపారేసిందట. ఈ ఎపిసోడ్ తో అయినా రోహిత్ మారుతాడో లేదో చూడాలి.
నాగార్జున , ఆడియన్స్ అంత చెప్పినా కూడా రోహిత్ లెక్క చేయకుండా , తనకు తోచింది చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం , టైటిల్ కాదు , కనీసం టాప్ 5 లో ఉండడం కూడా కష్టమే. గత ‘అగ్ని పరీక్ష’ సీజన్ నుండి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల కూడా మొదటి నాలుగైదు వారాలు ఆడియన్స్ లో ఫుల్ గా నెగెటివ్ అయ్యాడు. కానీ నాగార్జున ఇచ్చిన ఇన్ పుట్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని ముందుకు వెళ్లడం తో , అతని గ్రాఫ్ తిరుగులేని రేంజ్ కి వెళ్ళిపోయింది. చివరికి ఫినాలే వీక్ లో 60 శాతానికి పైగా ఓటింగ్ ని నమోదు చేసుకొని టైటిల్ విన్నర్ గా నిలిచాడు. రోహిత్ కూడా ఆట మార్చుకుంటే ఆ రేంజ్ కి వెళ్లగలడు. లేదంటే మరో షణ్ముఖ్ జస్వంత్ అవుతాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.