spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood Movie Updates 08.09.2021 : టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ సినిమా కబుర్లు !

Tollywood Movie Updates 08.09.2021 : టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ సినిమా కబుర్లు !

Telugu Movie UpdatesTollywood Movie Updates: నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్స్ విషయానికి వస్తే.. తెలుగు హీరో నుంచీ నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తో మళ్లీ రొమాన్స్ చేయాలని ఆశ పడుతుంది కంగనా. ఈ హాట్ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే.. మళ్లీ తనతో కలిసి నటించాలని ఉందని దర్శకుడు పూరి జగన్నాథ్ గారికి చెప్పాను. మరి చూడాలి, ప్రభాస్ నుంచి ఆ ఛాన్స్ వస్తుందేమో’ అంటూ మొహమాటం లేకుండా చెప్పుకొచ్చింది కంగనా. గతంలో కంగనా – ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ అనే చిత్రంలో కలిసి నటించారు.

‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ సినిమా మొదలుకానుంది. ఎప్పుడో సినిమా చేస్తున్నా అని రవితేజ చెప్పినా, ఇప్పటివరకూ డేట్స్ ఫిక్స్ చేయలేదు. అయితే, తాజాగా రవితేజ నక్కిన సినిమాకి డేట్స్ ఇచ్చేశాడు. అక్టోబర్ 2 నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో మొదలు కానుంది.

తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి ( Atlee) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షారుఖ్‌ ఖాన్ సరసన ‘లేడీ సూపర్ స్టార్ నయనతార’ నటిస్తోంది. ఈ సినిమాతో నయనతార మొదటిసారి బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే, ఈ సినిమాలో విలన్ గా రానా దగ్గుబాటి నటించబోతున్నాడట.

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. కాగా వినాయక చవితికి స్పెషల్ గా ‘ఆచార్య’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ దసరాకి ఉండే అవకాశం ఉంది.

నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ రానుంది. ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper