
RC15 Movie Launch: మెగా పవర్ స్టార్ రాంచరణ్ 15వ మూవీ ఈరోజు ఘనంగా మొదలైంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం వేడుకగా జరిగింది. పలువురు సినీ స్టార్ సెలబ్రెటీలు సందడి చేశారు.
అందరికంటే విశేషం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఈ సినీ వేడుకలో పాల్గొని టీంకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పడం సర్ ప్రైజ్ గా మారింది. ముహూర్తపు షాట్ లో భాగంగా చిరంజీవి తన తనయుడు రాంచరణ్ పై క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సౌత్ ఇండియా గొప్ప దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో చేయాలని తపన పడే హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే శంకర్ మాత్రం తెలుగు, తమిళంలో ఫేమ్ ఉన్న హీరోలతోనే సినిమాలు రూపొందిస్తున్నాడు. తాజాగా రాంచరణ్ తో సినిమా రూపొందిస్తున్నాడు. ఈరోజు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.
సూపర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం తాజాగా ఓ ఆసక్తికర పోస్టర్ ను విడుదల చేసింది.
ఈ పోస్టర్ లో హీరో రాంచరణ్, హీరోయిన్ కియారా, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు , కమెడియన్ సునీల్ ఇతర నటీనటులందరూ సూటుబూటు వేసుకొని ఫైల్స్ చేతబట్టుకొని వస్తున్నట్టు పిక్ లో చూపించారు.
రాంచరణ్ 15వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అంజలి, సునీల్, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనుండడం విశేషం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
https://twitter.com/CraziestSoul_/status/1435485552262868992?s=20
https://twitter.com/FansOfRamCharan/status/1435462682941919236?s=20