NTR: ఎన్టీయార్ తన దేవర సినిమా కాలర్ ఎగిరేసేలా ఉంటుందని చెప్పడానికి కారణం ఏంటి..?

దేవర సినిమా ఎప్పుడొస్తుందో చెప్పలేను కానీ, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా కాలర్ ఎగిరేసుకొని థియేటర్ నుంచి బయటికి వచ్చే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

Written By: Gopi, Updated On : April 10, 2024 10:02 am

Every fan will raise their collar in pride says NTR

Follow us on

NTR: సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు స్క్వేర్ సినిమా గత వారం రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిన్న నిర్వహించారు. ఇక దీనికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ తన సినిమా అయిన దేవర సినిమాని ఉద్దేశిస్తూ పలురకాల కామెంట్లను కూడా చేశాడు. దేవర సినిమా లో ఒక సిచువేషన్ చెబుతూ దానికి ఒక డైలాగులు కూడా చెప్పాడు. ఇక ఆ డైలాగ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా పర్లేదు గాని, దాని ఫలితం మాత్రం మనమే పొందాలి అని వచ్చే విధంగా దాని సారాంశాన్ని తెలియజేశాడు.

ఇక దేవర సినిమా ఎప్పుడొస్తుందో చెప్పలేను కానీ, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా కాలర్ ఎగిరేసుకొని థియేటర్ నుంచి బయటికి వచ్చే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేదు.ఇక ఇంతకు ముందు సినిమా బాగుంటే చూడండి లేదా మానేయండి అని మాత్రమే చెప్పేవాడు. కానీ సూపర్ హిట్ అవుతుందని పబ్లిక్ గా తను చెప్పడం ఎన్టీయార్ అభిమానులకి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఇంతవరకు ఎప్పుడు కూడా తన సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఇంత స్ట్రాంగ్ గా చెప్పలేదు.

ఇప్పుడు చెప్తున్నరంటే సినిమాలో సంథింగ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక దీన్ని బట్టి చూస్తే ఎన్టీయార్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పటివరకు పూర్తయిన సినిమాని చూసిన ఎన్టీఆర్ కి సినిమా మీద ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందట. ఇక కొరటాల శివ కూడా సినిమా కోసం ఎక్కువ టైం తీసుకున్న పర్లేదు కానీ ఫైనల్ గా ఈ సినిమాను సూపర్ హిట్ గా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే కొరటాల శివ కి తన గత చిత్రమైన ఆచార్యతో భారీ ఫ్లాప్ వచ్చింది. ఇప్పుడు ఒక భారీ సక్సెస్ కావాలి కాబట్టి ఈ సినిమా మీద పూర్తి ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందుకే ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనే విధంగా తన స్పీచ్ ని ఇస్తూ తన అభిమానులని ఎంకరేజ్ చేశాడనే చెప్పాలి…