Young player Nitish Reddy says he listens to Pawan Kalyan songs before match
Nitish Reddy: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ 2 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ ఉత్కంఠ భరిత పోరులో హైదరాబాద్ బౌలర్లు తమదైన రీతిలో బౌలింగ్ చేయడం వల్లే వాళ్లకి ఈ విజయమైతే దక్కింది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లకు 182 పరుగులు చేయడం విశేషం..
ఇక ఈ టీమ్ లో ఉన్న ప్లేయర్ లందరూ పెద్దగా రాణించకపోయిన ‘నితీష్ రెడ్డి’ అనే యంగ్ ప్లేయర్ 64 పరుగులతో ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసి టీం భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్రను పోషించాడు. అయితే నితీష్ రెడ్డి తెలుగు కుర్రాడు అవడం విశేషం… ఇక ఇదిలా ఉంటే నితీష్ రెడ్డి మ్యాచ్ ఆడడానికి ముందు తను పవన్ కళ్యాణ్ సినిమా పాటను వింటానని గ్రౌండ్ లోకి దిగడానికి ముందే ‘జానీ ‘ సినిమాలోని ‘నా రాజుగాకురా మా అన్నయ్య’ అనే సాంగ్ విని తను గ్రౌండ్ లో అడుగు పెడతానని ఇంతకుముందు తను చెప్పాడు. ఇక దానికి తగ్గట్టుగానే తనే స్వయంగా గా ఆ పాట పాడటం విశేషం..ఇక ఆయన పడిన పాట ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది…
నిజానికి నితీష్ రెడ్డి పవన్ కళ్యాణ్ అభిమాని అందుకే ఎప్పుడు చూసిన ఆయన పాటలు వింటూ ఉంటానని గతంలో తను చెప్పాడు. ఇక అలాగే గ్రౌండ్ లోకి దిగే ముందు మాత్రం జానీ సినిమాలోని పాట రిపీటెడ్ గా వింటూ ఉంటానని దానివల్ల తనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందని, ఇక ఎలాంటి సమయంలో మ్యాచ్ ఎలా ఆడితే మన చేతిలోకి వస్తుంది అనేంతలా తన బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది అందుకే ఆ సాంగ్ వింటానని చెప్పడం విశేషం…
ఇక మొత్తానికైతే మన తెలుగు కుర్రాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులందరు ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట కూడా హైదరాబాద్ టీమ్ ఆడే మ్యాచ్ ల్లో నితీష్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక చాలా సంవత్సరాల తర్వాత ఒక తెలుగు కుర్రాడు హైదరాబాద్ టీమ్ తరుపున అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…