Devara: దేవర సినిమా కోసం ఎన్టీఆర్ చేస్తున్న పని వైరల్

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాతోనే అలనాటి అందాల దివంగత తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్నారు.

Written By: Swathi, Updated On : March 18, 2024 5:34 pm

Devara

Follow us on

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల్లో ఒకరిగా పేరుగాంచిన ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రఖ్యాతి గడించారు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రికార్డు సృష్టించారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నారు.

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాతోనే అలనాటి అందాల దివంగత తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ మేరకు హైదరాబాద్ లో కీలకమైన సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరిస్తుంది.

అయితే, నార్మల్ గా సమ్మర్ వచ్చిందంటే చాలు సినీ ప్రముఖులు అంతా వెకేషన్ మూడ్ లోకి వెళ్లిపోతారు. షూటింగ్ లకు విరామం ఇచ్చేసి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు బయలుదేరుతారు. కానీ ఈ సమ్మర్ లో ఎన్టీఆర్ కు ఆ ఛాన్స్ లేదని తెలుస్తోంది. ‘దేవర ’ సినిమా కోసం ఆయన ఈ వేసవిలోనూ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

దేవర చిత్రాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చిత్ర బృందంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా భావిస్తున్నారట. అందుకే ఈ సమ్మర్ లో రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ కే సమయాన్ని కేటాయించనున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ పార్ట్ దాదాపు పూర్తి కావొచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ వారంలో గోవా వెళ్లబోతున్న చిత్ర యూనిట్ అక్కడ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ పై ఓ పాటను చిత్రీకరించనున్నారు. అలాగే కొన్ని కీలక సన్నివేశాలను సైతం తెరకెక్కించనున్నారు.

కాగా ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుథ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా వస్తున్న దేవర చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం భారీ అంచనాలను పెట్టుకున్నారు.