Sidhu Jonnalagadda : ఒక్క సినిమాతో మారిపోయిన సిద్ధూ జొన్నలగడ్డ రేంజ్… ఏకంగా వాళ్లతో పోటీ!

సిద్ధూ జొన్నలగడ్డ టైర్ టు హీరోల జాబితాలో చేరినట్లు అయ్యింది. నాని, విజయ్ దేవరకొండ సరసన సిద్ధూ జొన్నలగడ్డ చేరాడు. సపోర్టింగ్ రోల్స్ చేసే స్థాయి నుండి టైర్ టు హీరోల లిస్ట్ లో టాప్ 5లో సిద్ధూ జొన్నలగడ్డ చోటు దక్కించుకున్నాడు.

Written By: NARESH, Updated On : April 1, 2024 1:22 pm

DJ Tillu 2

Follow us on

Sidhu Jonnalagadda : ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు సిద్ధూ జొన్నలగడ్డ. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ లో కాలేజ్ స్టూడెంట్ రోల్ చేశాడు. 2009లో జోష్ విడుదలైంది. ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు, డాన్ శ్రీను చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. బాయ్ మీట్ గర్ల్ చిత్రంతో సిద్ధూ హీరోగా మారాడు. హీరోగా ప్రయత్నాలు చేస్తూనే విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కల్కి మూవీలో సిద్ధూ విలన్ రోల్ చేయడం విశేషం. కృష్ణ అండ్ హిజ్ లీల మూవీలో హీరోగా నటించాడు. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.

కృష్ణ అండ్ హిజ్ లీల నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. 2022లో విడుదలైన డీజే టిల్లు సిద్ధూ ఇమేజ్ మార్చేసింది. అతనికి యూత్ లో గుర్తింపు తెచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు లాభాల పరంగా బ్లాక్ బస్టర్. ఈ చిత్రం నిర్మాతలకు కాసులు కురిపించింది. సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు పాత్రలో ఇరగదీశాడు. ఆయన క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంది. కామెడీ, క్రైమ్, రొమాన్స్ కలగలిపి డీజే టిల్లు రూపొందించారు.

డీజే టిల్లు సక్సెస్ నేపథ్యంలో దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరపైకి తెచ్చారు. మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ ముగిసే నాటికి రూ. 50 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. కుర్రాళ్ళు టిల్లు స్క్వేర్ చిత్రం కోసం ఎగబడుతున్నారు. యూత్ తో థియేటర్స్ నిండిపోతున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ టిల్లు స్క్వేర్ రూ. 100 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టడం ఖాయం అంటున్నాడు. ఆయన అంచనా నిజమయ్యేలా టిల్లు స్క్వేర్ వసూళ్లు ఉన్నాయి.

ఈ క్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ టైర్ టు హీరోల జాబితాలో చేరినట్లు అయ్యింది. నాని, విజయ్ దేవరకొండ సరసన సిద్ధూ జొన్నలగడ్డ చేరాడు. సపోర్టింగ్ రోల్స్ చేసే స్థాయి నుండి టైర్ టు హీరోల లిస్ట్ లో టాప్ 5లో సిద్ధూ జొన్నలగడ్డ చోటు దక్కించుకున్నాడు. గతంలో ఈ లిస్ట్ లో ఉన్న నితిన్, రామ్ పోతినేని, శర్వానంద్ పరాజయాలతో రేసులో వెనుకబడ్డాడు. సిద్ధూ జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.