Pushpa 2 : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. నిజానికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకుంది అంటే అది మన స్టార్ హీరోలు చేస్తున్న ప్రయత్నం వల్లే ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆ స్థాయిలో ఉందని చెప్పాలి… ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి వేసిన బాటలోనే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నడవడం వల్లే మనం అద్భుతాలను చేయగలుగుతున్నాం…
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 2’ సినిమా పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులన్నింటిని బ్రేక్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి నెల రోజులు కావస్తున్న నేపధ్యంలో ఇప్పటికే 1850 కోట్లకు పైన కలెక్షన్లను వసూలు చేసి బాహుబలి రికార్డును బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే 2000 కోట్ల మార్కును కూడా టచ్ చేసి ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమా అందుకోలేని రికార్డులను ఈ సినిమా కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచే దిశగా ముందుకు దూసుకెళ్తుంది… ఇక కొత్త సంవత్సరం వచ్చినా కూడా ఈ సినిమా జోరు అయితే తగ్గడం లేదు. ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. నార్త్ లో అయితే ఈ సినిమా కలెక్షన్లు సునామిని సృష్టిస్తుంది. ఇప్పటికే నార్త్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇండస్ట్రీ హిట్ నమోదు చేయాలని చూస్తుంది… ఇక ఇంకో 50 కోట్లు అయితే దంగల్ సినిమా రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది…
మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో పొజిషన్ ని దక్కించుకున్నాడనే చెప్పాలి. మొన్నటిదాకా ప్రభాస్ పేరు మీద ఉన్న అన్ని రికార్డులు అల్లు అర్జున్ బ్రేక్ చేస్తూ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం…ఇక ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమాతో కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు.
మరి రాబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను సాధించి పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో పొజిషన్ ని దక్కించుకోవాలని తమ అభిమానులైతే కోరుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంఘటనకు సంబంధించిన కేసులో ఇరుక్కున్న విషయం మనకు తెలిసిందే.
ఇక తొందర్లోనే ఆ కేసు నుంచి బయటపడి త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో పాల్గొనడానికి ఆయన సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఫ్యూచర్ లో అల్లు అర్జున్ ఎలాంటి సినిమాలు చేస్తాడు. ఆయన నుంచి వచ్చే సినిమాలు ఎంత పెద్ద భారీ విజయాలను సాధిస్తాయి అనేది…