https://oktelugu.com/

Game Changer : గేమ్ చేంజర్ డాకు మహారాజ్ రెండు సినిమాల్లో ఏ మూవీ పై చేయి సాదించబోతుంది..?

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సినిమాతో ఈ సంక్రాంతికి బరిలోకి దిగుతున్నాడు. మరి ఈ క్రమంలోనే అతనికి పోటీగా బాలయ్య బాబు 'డాకు మహారాజు' అనే సినిమాతో వస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 3, 2025 / 02:08 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాతో ఈ సంక్రాంతికి బరిలోకి దిగుతున్నాడు. మరి ఈ క్రమంలోనే అతనికి పోటీగా బాలయ్య బాబు ‘డాకు మహారాజు’ అనే సినిమాతో వస్తున్నాడు. మరి వీరిద్దరి మధ్య పోటీ అనేది తీవ్ర స్థాయిలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో రాబోతున్నప్పటికి ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేసుకొని వస్తుంది. కాబట్టి యావరేజ్ సినిమాగా మారబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల మధ్యనే పోటీ విపరీతంగా ఉంది. ఈ రెండింటిలో ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది. ఏ సినిమా సక్సెస్ ని సాధించలేక డీలపడిపోతుందనేది తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రామ్ చరణ్ పోటీ పడుతున్నాడనే చెప్పాలి… మరి ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ స్టార్ హీరోలుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. కాబట్టి ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవాలని ఉద్దేశ్యంతో ఈ సినిమాని భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కేవలం తెలుగులో రిలీజ్ అవుతున్నప్పటికి బాలయ్య బాబుకు సంక్రాంతి సీజన్ చాలా బాగా కలిసి వస్తుంది.

    ఇక రీసెంట్ టైమ్స్ లో ఆయన చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి, వీర సింహ రెడ్డి లాంటి రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. కాబట్టి ఈ సినిమాతో కూడా తనే సంక్రాంతి విజేతగా నిలుస్తానని చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. మరి రామ్ చరణ్ సైతం సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

    ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ఎవడు, నాయక్ లాంటి సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్లను కైవసం చేసుకున్నాయి. మరి మరోసారి రామ్ చరణ్ తన హిట్ ట్రాక్ ను రిపీట్ చేయాలని చూస్తున్నాడు. బాలయ్య బాబు నట విశ్వరూపాన్ని చూపిస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమాలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ అయితే ఉండబోతున్నాయి.

    అలాగే రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఒక పొలిటికల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కుతుంది.ఇక ఎటు చూసినా కూడా రెండు సినిమాల్లో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే పుష్కలంగా ఉండబోతున్నాయి. తద్వారా ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ బాట పట్టే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది…