Rajanala Kaleswara Rao : ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా మారిన రాజనాల అంటే ఇప్పటికి ప్రతి ఒక్కరికి ఎనలేని గౌరవమైతే ఉంటంది… ఈరోజు ఆయన శత జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. కారణం ఏదైనా కూడా రాజునాల కెరియర్ మొదట్లో చాలా అగ్రేసివ్ గా ఉండేవాడు. మంచి పాత్రలను పోషించడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు. ఇక ఇది ఇలా ఉంటే చిన్నప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉండి చదువుకునేవాడు. ఇంటి దగ్గర నుంచే ఎగ్జామ్స్ రాసేవాడు. మొత్తానికైతే రెవెన్యూ శాఖలో గుమస్తాగా కొన్ని రోజులపాటు పనిచేశాడు. ఇక ఆ తర్వాత ఎగ్జామ్ రాసిన ఆయనకి ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. ఇక ఇన్స్పెక్టర్ జాబ్ లో ఉంటూనే నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవాడు. దీనివల్ల గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నవాళ్లు నాటకాల ప్రదర్శించకూడదనే ఉద్దేశ్యంతో అతన్ని తన జాబ్ నుంచి సస్పెండ్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా రాజనాల ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా సినిమాల మీద నాటకాల మీద ఉన్న పిచ్చితో మద్రాసు వెళ్లి అక్కడ తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఇక హెచ్ఎం రెడ్డి నిర్మించిన ‘ప్రతిజ్ఞ’ సినిమాలో తను తొలి అవకాశాన్ని అందుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే మంచి నటుడుగా గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను అయితే సంపాదించుకున్నాడు. తెలుగులో ఎన్టీఆర్, కాంతారావు లాంటి హీరోలు జానపద చిత్రాలు చేసినప్పుడు అందులో మంత్రగాడిగా, సేనాపతిగా చాలా పాత్రలను పోషించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
మరి ఏ పాత్రలో ఎంత గుర్తింపు వచ్చినా కూడా ఆయన విలనిజాన్ని పండించడంలోనే భారీ పాపులారిటిని సంపాదించుకున్నాడు…ఇక 1968 వ సంవత్సరంలో ‘వరకట్నం ‘ అనే సినిమా షూటింగ్ లో భాగంగా తాడేపల్లిగూడెంలోని పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేశారు. అప్పుడు అక్కడికి సినిమా షూటింగ్ చూడ్డానికి వచ్చిన చాలామంది జనాలు బ్రేక్ టైమ్ లో కృష్ణ కుమారి ని కలిసి మాట్లాడడానికి చాలామంది లేడీస్ అయితే వచ్చేవారట…
దాంతో కృష్ణ కుమారి గారితో మాట్లాడుతుండగా షాట్ పూర్తి చేసుకొని రాజనాల కృష్ణకుమారి గారి దగ్గరికి వస్తున్న క్రమంలో ఆ లేడీస్ అమ్మో రాజనాల వస్తున్నాడు అంటూ పరుగులు తీశారట. దాంతో రాజనాల, కృష్ణకుమారి చాలాసేపటి వరకు నవ్వుతూ కూర్చున్నారట. మరి ఏది ఏమైనా కూడా అప్పుడు ఉన్న జనాలు స్క్రీన్ మీద విలన్ గా కనిపిస్తే అతను నిజ జీవితంలో కూడా అలానే ఉంటాడు అనుకునేవారు. అలాగే హీరోలు నిజ జీవితంలో కూడా హీరోలానే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అనే ఒక అమాయకపు ధోరణిలో ఉండేవారు…
ఏది ఏమైనా కూడా రాజనాల తెలుగు తమిళ్, కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు…ఇక ‘మాయ ‘ అనే ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించి మెప్పించాడు. హాలీవుడ్ సినిమాల్లో నటించిన తొలి ఇండియన్ నటుడిగా కూడా రాజనాల మంచి గుర్తింపైతే సంపాదించుకున్నాడు… ఇక తన మొదటి భార్య చనిపోవడంతో ఆయనలో ఉన్న వైభవం అంతా పోయినట్టు అయింది. రెండో పెళ్లి చేసుకొని హైదరాబాద్ కి మకాం మార్చాడు. ఇక హలో బ్రదర్ లాంటి సినిమాలో నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఆయన కెరియర్ ఎండింగ్ లో ఆయన కాలికి చిన్న దెబ్బ తగలడం వల్ల అతనికి ఆల్రెడీ మధుమేహం ఉండడంతో కాలు పాయిజన్ అయింది. దాంతో అతని ఒక కాలును కొట్టేశారు… ఇక ఆ కాలు పోయినా కూడా ఆయన ఎప్పుడు నిరుత్సాహపడలేదు. ఎందుకంటే రెండు కాళ్లు లేని చాలామంది జనాలు మన సొసైటీలో ఉన్నారు.
నాకు ఒక కాలు మాత్రమే పోయింది ఒక కాలు అయితే ఉంది కదా అంటూ ఇంటర్వ్యూ లు ఇచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉండేవాడు… ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో పాత్రలను పోషించి మెప్పించినప్పటికి ఇప్పుడు ఆయన పేరు చెబితే మాత్రం విలన్ పాత్రలు మాత్రమే గుర్తుకు వస్తాయి…ఇక తెర ముడ్ను విలన్ గా మారిన ఆయన తెర వెనుక మాత్రం ఎన్నో గొప్ప కార్యాలను నిర్వహించాడు. తన దగ్గరికి వచ్చిన వారికి లేదనుకుండా సహాయం చేసేవాడు. ఆకలి అన్నవారికి అన్నం పెట్టించేవాడు.. డబ్బు సహాయం కావాలని వచ్చిన వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగేవాడు. ఇలా రాజునాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది…