Akshay Kumar: అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమాల్లో కంటెంట్ బాగున్నప్పటికీ ఆ ఒక్క విషయం లోనే తేడా కొడుతుందా..?

బాలీవుడ్ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది. ఇండస్ట్రీ హిట్ మాట దేవుడెరుగు కనీసం ఒక సూపర్ హిట్ ఇచ్చే హీరోలు కూడా కరువయ్యారు...ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేస్తున్న 'స్కై ఫోర్స్' సినిమా మీదనే ఆయన భారీ అంచనాలను పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాకి మొదట ఎం ఎం కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.

Written By: Gopi, Updated On : July 31, 2024 12:37 pm

Akshay Kumar

Follow us on

Akshay Kumar: ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను అందుకున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన సంవత్సరానికి దాదాపు నాలుగు నుంచి ఐదు సినిమాలను రిలీజ్ చేస్తూ వరుస సక్సెస్ లను అందుకుంటూ వచ్చాడు. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా పేరు సంపాదించుకున్న ఖాన్ త్రయానికి సైతం సాధ్యం కానీ రీతిలో ఈయన వరుస సక్సెస్ లను అందుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే అది మినిమం గ్యారంటీ గా గుర్తింపు పొందేది. అలాంటిది గత మూడు సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు. విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ఫ్లాపుల్లో ఉండి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక రీసెంట్ గా ‘సర్ఫీరా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాలో కంటెంట్ అయితే బాగుంది అని అందరూ ప్రశంసించారు. కానీ ఫైనల్ గా మాత్రం సినిమా ఫ్లాప్ అయిందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే అక్షయ్ కుమార్ తన వరుస సినిమాలకు సంబంధించిన టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండడం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోగాని, సినిమాటోగ్రఫీ విషయాల్లో గాని చాలావరకు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అరకొర మ్యూజిక్ ఇస్తు అంత పెద్ద బ్రాండ్ నేమ్ లేని వాళ్లను తీసుకొని సినిమాకి విజువల్ గా కూడా గ్రాండ్ ఇయర్ ని తీసుకు రాలేకపోతున్నారు.

Also Read: తన ఆటిట్యూడ్ వల్లనే ఈ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న ఆర్జీవీ..?

ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేస్తున్న ‘స్కై ఫోర్స్’ సినిమా మీదనే ఆయన భారీ అంచనాలను పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాకి మొదట ఎం ఎం కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. కానీ ఆయనకి, ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిలీప్ కుమార్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్టు నుంచి కీరవాణి తప్పుకున్నాడు. ఇక దాంతో జీ వి ప్రకాష్ కుమార్ ని ఈ ప్రాజెక్టులో చేర్చుకున్నారు. ఇక ఇంతకుముందే అక్షయ్ కుమార్ చేసిన సర్ఫీరా సినిమాకి కూడా జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు.

ఇక ఆ సినిమా సాంగ్స్ కొంతవరకు బాగున్నప్పటికీ ప్రేక్షకుల్ని మైమరపింపజేయడం మాత్రం ఆయన ఫేలయ్యాడు. మరి మళ్లీ ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లోనే అక్షయ్ కుమార్ ఈ సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ తన అభిమానులు చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం చేయబోయే సినిమాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు సినిమాలతో సక్సెస్ లను అందుకునే ఆయన మూడు సంవత్సరాల నుంచి ఒక్క సక్సెస్ కూడా లేకుండా వరుసగా 18 డిజాస్టర్లను ఇవ్వడం అనేది నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసినా కూడా అక్షయ్ కుమార్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు సక్సెస్ లో ఉండి ఇప్పుడు ఫెయిల్యూర్ లో ఉన్న హీరో కాబట్టి ఇప్పుడు ఆయన రెమ్యూనరేషన్ కూడా చాలావరకు తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి తొందర్లోనే తనను తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప ఆయన మార్కెట్ మళ్ళీ పెరిగే అవకాశాలైతే లేవు…

Also Read: రజినీకాంత్ కోసం రంగం లోకి దిగుతున్న ధనుష్…ఇంతకీ వీళ్ళ మధ్య మాటలు ఉన్నాయా..?