https://oktelugu.com/

RGV: తన ఆటిట్యూడ్ వల్లనే ఈ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న ఆర్జీవీ..?

సినిమా ఇండస్ట్రీ లో ఎంత ఒదిగి ఉంటే అంత పైకి ఎదుగుతాం అనేది మాత్రం వాస్తవం... అలా కాకుండా ఒకటి రెండు సక్సెస్ లు రాగానే మాకంటే తోపులు ఎవరు లేరు అనుకొని ఆటిట్యూడ్ చూపిస్తే ఇండస్ట్రీ వాళ్ళను తీసి పక్కన పెట్టేస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : July 31, 2024 / 08:58 AM IST

    RGV

    Follow us on

    RGV: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శివ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… మొదటి సినిమాతోనే పెను ప్రభంజనాన్ని సృష్టించి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో తనతో సినిమా చేయాలని అనుకునేలా చేశాడు…ఇక మొత్తానికైతే కెరియర్ మొదట్లో ఆయన చేసే సినిమాల్లో ఒక మంచి కథాంశం అయితే ఉండేది. ఇక ఒకనొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా స్టార్ట్ చేసి బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో మధ్యలోనే చిరంజీవి సినిమాను వదిలేసి బాలీవుడ్ చెక్కేశాడు…ఇక దాంతో చిరంజీవి బాగా హర్ట్ అయి ఆయనతో ఇక జీవితంలో సినిమా చేయనని చెప్పేసాడు. అందువల్లే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా అనేది రాలేదు. నిజానికి రామ్ గోపాల్ వర్మ కెరియర్ స్టార్టింగ్ లో చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాడు. దానికి చిరంజీవి కూడా అవకాశం ఇచ్చినప్పటికి దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు కారణం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ అలా ఒక స్టార్ హీరో సినిమాని స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసి వెళ్లడం అనేది సరైన విషయం కాదు అంటూ అప్పట్లో మీడియాలో చాలా రకాల కథనాలైతే వచ్చాయి. ఆర్జీవీ అలా చేయడానికి గల కారణం ఏంటి అంటే నేను తోపు డైరెక్టర్ ని అని తను ఫీలై పోయి చిరంజీవి కంటే బెస్ట్ ఆఫర్ బాలీవుడ్ లో వచ్చింది. కాబట్టి అక్కడ సినిమా చేసి వచ్చేంత వరకు చిరంజీవి నాకోసం వెయిట్ చేస్తాడు అనే ఒక భ్రమలో ఉన్న ఆర్జీవి ఇలా చేశాడు అంటూ మరి కొంతమంది మెగా ఫ్యాన్స్ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు…

    Also Read: రామ్ చరణ్ తో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కూడా ఆడిపాడరనే విషయం మీకు తెలుసా..?

    ఇక ఈ ఓవర్ ఆటిట్యూడ్ వల్లే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలకు మాత్రమే పరిమితమయ్యాడు. అంతే తప్ప మిగతా స్టార్ హీరోలతో సినిమాలను చేయలేకపోయాడు. ఇక మన హీరోలకు నచ్చిన నచ్చకపోయిన తను చెప్పిన కథతో మాత్రమే సినిమా చేయాలి. ఒకవేళ హీరోలు మాకు ఈ కథ నచ్చలేదు వేరే కథ చెప్పండి అంటే ఆర్జీవి ఆ హీరోనే మార్చేస్తాడు… మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల విషయంలో కూడా ఇదే ప్రూవ్ అయింది. అందువల్లే స్టార్ హీరోలు అందరు అతన్ని పక్కన పెట్టారు.

    ఇక ఇప్పుడు ఆయన కొన్ని వల్గర్ సినిమాలు చేసుకుంటూ వాటిని తన ఇష్టం వచ్చినట్టుగా తీస్తూ యూట్యూబ్ లో రిలీజ్ చేసుకుంటున్నాడు. మనకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది. అప్పుడే మనం మన కెరియర్ పరంగా ముందుకు సాగుతాం అనే విషయాన్ని ఆర్జీవీ మొదట్లో బాగా క్యాచ్ చేసినప్పటికీ, ఆ తర్వాత మాత్రం తన కంటే తోపు ఎవడు లేడు అనే ఒక డైలమాలో ఉండిపోయాడు.

    అందుకే తనకి నచ్చిన సినిమాలను తీస్తూ వస్తున్నాడు. స్టార్ హీరోస్ డేట్స్ ఇవ్వకపోయిన ఎక్కడ తగ్గకుండా వివిధ రకాల సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక మొత్తానికైతే రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఆయన తీసిన ఒక మూడు నాలుగు మంచి సినిమాలు గుర్తొస్తాయి అంతే తప్ప ఇప్పుడు చేసే చెత్త సినిమాల రామ్ గోపాల్ వర్మ ని ఎవరు గుర్తుంచుకోరు అనేది వాస్తవం…

    Also Read: అల్లు అర్జున్ సర్జరీల గుట్టు విప్పిన ప్రముఖ డాక్టర్… ఆ రెండు పార్ట్స్ కి జరిగిందంటూ కీలక కామెంట్స్, వీడియో వైరల్