https://oktelugu.com/

Evaru Meelo Koteeswarulu: ఈఎంకే లో ఎన్టీఆర్ – మహేష్ బాబు పూనకాల ఎపిసోడ్ కు ఊహించని షాక్… గట్టి దేబ్బే తగిలిందా

Evaru Meelo Koteeswarulu: జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో ముగిసింది. గతంలో చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన షోలు స్టార్ మాటీవీలో ప్రసారం కాగా.. జూనియర్ ఎన్టీఆర్‌ హోస్ట్ చేసిన షో మాత్రం జెమినీ టీవీలో టెలీకాస్ట్ చేశారు. సామాన్యుడి నుంచి సెలబెట్రీల దాకా ప్రతీఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని కోటి రూపాయలను గెలుచుకునే సువర్ణ అవకాశం ఉంది. దీంతో సహజంగానే ఈ షోపై అందరికీ ఆసక్తి పెరిగింది. చాలా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 08:18 PM IST
    Follow us on

    Evaru Meelo Koteeswarulu: జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో ముగిసింది. గతంలో చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన షోలు స్టార్ మాటీవీలో ప్రసారం కాగా.. జూనియర్ ఎన్టీఆర్‌ హోస్ట్ చేసిన షో మాత్రం జెమినీ టీవీలో టెలీకాస్ట్ చేశారు. సామాన్యుడి నుంచి సెలబెట్రీల దాకా ప్రతీఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని కోటి రూపాయలను గెలుచుకునే సువర్ణ అవకాశం ఉంది. దీంతో సహజంగానే ఈ షోపై అందరికీ ఆసక్తి పెరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ప్రశ్నలు వేస్తూ పార్టిసిపేట్స్ నుంచి జవాబులను రాబడట్టడం ఈ షో ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు. అయితే ఈ షోకు భారీ టీఆర్పీలు వస్తాయని నిర్వాహకులు ఆశించారు. కానీ ప్రారంభంలో ఆశలు రేకెత్తించిన టీఆర్పీలు రాను రాను తీసికట్టుగా వచ్చాయి.

    Evaru Meelo Koteeswarulu

    Also Read: టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్యూషన్ లో చేరండయ్యా..!

    ఈ నేపథ్యంలో సీజన్ చివరి ఎపిసోడ్‌కు ఏకంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు లాంటి హీరోను ముఖ్య అతిథిగా తీసుకువచ్చినా టీఆర్పీ రేటింగ్‌లో మాత్రం నిర్వాహకులకు చుక్కెదురైందనే చెప్పాలి. ఎన్టీఆర్ – మహేష్‌బాబు కలిసి నటించిన ఎపిసోడ్‌కు పూనకాల ఎపిసోడ్ అని నిర్వాహకులు భారీ ఎత్తున ప్రచారం చేసినా టీఆర్పీ మాత్రం ఊహించిన వాసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఎపిసోడ్‌కు కేవలం 4.9 టీఆర్పీ మాత్రమే నమోదైంది. అయితే గతంలో రామ్‌చరణ్ అతిథిగా వచ్చిన ఎపిసోడ్‌కు ఏకంగా 11.4 టీఆర్పీ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో సగం రేటింగ్ కూడా మహేష్‌బాబు ఎపిసోడ్‌కు రాకపోవడం నిర్వాహకులను బాగా నిరాశ కలిగించింది. కాగా ఇదే వారంలో జెమినీ టీవీ పాగల్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలీకాస్ట్ చేయగా 5.2 టీఆర్పీ రావడం గమనార్హం. ఈ తరుణంలో మరి నెక్స్ట్ సీజన్ ను కూడా జెమిని ప్రసారం చేస్తుందా లేదా అనే సందేహాలు కొత్తగా మొదలవుతున్నాయి. చేస్తే హోస్ట్ గా ఎవరు చేస్తారు అనే ప్రశ్నలు అందరిలో కలుగుతున్నాయి.

    Also Read: పక్క రాష్ట్రాల్లో బెనిఫిట్​ షోకు లేని ఇబ్బంది.. ఏపీలో ఎందుకొచ్చింది?