https://oktelugu.com/

Pushpa: బన్నీ పార్టీకి సిద్ధంగా ఉండు అంటున్న రియల్ హీరో సోనూసూద్

Pushpa: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం “పుష్ప”.పాన్‌ ఇండియా తరహాలో ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ,సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పుష్ప ది రైజ్‌ “పేరుతో భారీ అంచనాల నడుమ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 08:35 PM IST
    Follow us on

    Pushpa: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం “పుష్ప”.పాన్‌ ఇండియా తరహాలో ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ,సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    Sonu Sood

    “పుష్ప ది రైజ్‌ “పేరుతో భారీ అంచనాల నడుమ ఈ ఏడాది డిసెంబర్‌ 17న ఫస్ట్‌ పార్ట్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకాబోతోన్న ఈ సినిమాకు అన్ని ఇండస్ట్రీల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ఈ చిత్రానికి మంచి విజయం చేకూరాలని తోటి నటి నటులు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    Also Read: ‘పుష్ప- ది రైజ్’ రివ్యూ

    అయితే తాజాగా ఎంతోమంది అభిమానుల తో రియల్ హీరో గా గుర్తింపు పొందిన రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ వేదికగా “పుష్ప” చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. పార్టీకి సిద్ధంగా ఉండాలని హీరో బన్నీని కోరారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ ట్వీట్ ఏమిటంటే…బన్నీ బ్రదర్.. “పుష్ప” హిందీ వెర్షన్ భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.ఈ సినిమా చూసేందుకు ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. సక్సెస్ పార్టీ కోసం సిద్ధంగా ఉండండి.అంటూ సోనూసూద్ తెలిపారు.ఈ ట్వీట్‌కు ఐకాన్‌ స్టార్‌ అభిమానులు సోనూసూద్‌కు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో రికార్డు … 2021 లో అల్లు అర్జున్ టాప్