Alia Bhat: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై’ అనే బుక్ ఆధారంగా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంలో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగింది ? అనేదే సినిమా ప్రధానాంశం. ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్, టీజర్ విడుదలై విశేష స్పందన రాబట్టుకుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.

Also Read: పుష్ప సాంగ్‌పై మాధవిలత షాకింగ్ కామెంట్స్
కాగా తాజాగా వచ్చే సంవత్సరం జరగబోతున్న 72వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘గంగూబాయి కతియావాడి’ అధికారికంగా ఎంపికైంది. ఈ విషయాన్ని అలియా భట్ తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఈ వర్తతో అలియా భట్ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు అలియా భట్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, తారక్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు … తారక్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపించనున్నారు. అలియా చరణ్ కి జోడీగా నటించనుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే సీత పాత్రలో అలియా అదరగొట్టింది అని చెప్పాలి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన రిలీజ్ కానుంది.
So grateful to be part of a wonderful team that now celebrates its official selection to the #BerlinFilmFestival2022🌙
See you on 18th February, 2022🤍#SanjayLeelaBhansali @ajaydevgn @prerna982 @jayantilalgada @PenMovies @bhansali_produc @saregamaglobal pic.twitter.com/VX5dG1PNMV
— Alia Bhatt (@aliaa08) December 16, 2021
Also Read: హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్