Evaru Meelo Koteeswarulu: తెలుగు బుల్లితెరపై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమం ఎవరు కోటీశ్వరులు.అయితే ఇప్పటివరకు తెలుగులో మూడు సీజన్లో ప్రసారమైన ఏ సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ కోటి రూపాయలను గెలవలేదు. తాజా ఈ సీజన్లో మాత్రం కొత్తగూడెంకి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ బి రాజా రవీంద్ర అనే పోలీస్ ఆఫీసర్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నారు. రాజా రవీంద్ర రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్.ఎస్ రాజు, శేషుకుమారి సంతానం ఈయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇప్పటివరకు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఏ ఒక్క ఎపిసోడ్లో కూడా కోటి రూపాయల ప్రశ్న అనే మాటలను ఉపయోగించలేదు. ఇలా ఏకంగా కోటి రూపాయల ప్రశ్నకి కూడా ఎంతో చాకచక్యంగా సమాధానం చెబుతూ తెలుగులో మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే కోటి రూపాయలు గెలుచుకున్న ఇతనికి ఎన్ని లక్షలు చేతికి అందింది అనే విషయానికి వస్తే… ఆదాయపు పన్ను చట్టం ప్రకారం 10 వేలకు మించి గెలుపొందితే తప్పనిసరిగా ప్రభుత్వానికి టాక్స్ కట్టాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి చట్టం ప్రకారం 31.2% పన్ను చెల్లించాల్సి ఉండగా ఆ ప్రైస్ మని డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ద్వారా కోటి రూపాయలు ప్రైస్ మనీ గెలుచుకుంటే ఇందులో గెలిచిన వ్యక్తి చేతికి అందే డబ్బు కేవలం 68,80,000 మాత్రమే. మిగతా రూ.31,20,000 పన్ను రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా కోటి రూపాయలు గెలుచుకున్న రాజారవీంద్ర చేతికి కూడా కేవలం 68 లక్షల 80 వేల రూపాయలు మాత్రమే అందుతాయి.